Revanth Reddy: కేసీఆర్ ఆరోగ్యంపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా
ABN , First Publish Date - 2023-12-08T13:00:32+05:30 IST
హైదరాబాద్: మాజీ సీఎం కేసీఆర్‌కు శుక్రవారం సాయంత్రం 4 గంటలకు యశోద ఆస్పత్రి వైద్యులు ఆపరేషన్ చేయనున్నారు. గురువారం రాత్రి ఫామ్ హౌస్‌లో కాలుజారి పడిపోవడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. దీంతో కుటుంబసభ్యులు హుటాహుటిన యశోద ఆస్పత్రికి తరలించారు. కేసీఆర్ కోసం గ్రీన్ చానల్ ఏర్పాటు చేసిన పోలీసులు ట్రాఫిక్ క్లియరెన్స్ చేశారు.
హైదరాబాద్: మాజీ సీఎం కేసీఆర్ (Ex CM KCR)కు శుక్రవారం సాయంత్రం 4 గంటలకు యశోద ఆస్పత్రి (Yasoda Hospital) వైద్యులు ఆపరేషన్ చేయనున్నారు. గురువారం రాత్రి ఫామ్ హౌస్‌లో కాలుజారి పడిపోవడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. దీంతో కుటుంబసభ్యులు హుటాహుటిన యశోద ఆస్పత్రికి తరలించారు. కేసీఆర్ కోసం గ్రీన్ చానల్ (Green Channel) ఏర్పాటు చేసిన పోలీసులు ట్రాఫిక్ క్లియరెన్స్ చేశారు. కేసీఆర్‌కు తొంటి ఎముక రెండు చోట్ల విరిగినట్లు వైద్యులు తెలిపారు. ఆయనకు ఆపరేష్ చేయాల్సి ఉంటుందని ఇప్పటికే వైద్యులు వెల్లడించారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆరా తీశారు. ఆయనకు మెరుగైన వైద్యం అందించాలని ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీకి సూచించారు. ముఖ్యమంత్రి ఆదేశాలమేరకు ఆరోగ్యశాఖ కార్యదర్శి యశోద ఆస్పత్రికి వెళ్లారు. వైద్యులతో మాట్లాడి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు.
హెల్త్ బులెటిన్ విడుదల..
కేసీఆర్ హెల్త్ బులెటిన్‌ను యశోద ఆస్పత్రి వైద్యులు విడుదల చేశారు. కోలుకునేందుకు 6 నుంచి 8 వారాలు పడుతుందన్నారు. ప్రస్తుతం కేసీఆర్ వైద్యుల పరిరక్షణలో ఉన్నట్లు తెలిపారు. కాగా గురువారం రాత్రి ఫామ్ హౌస్ బాత్ రూమ్‌లో జారి పడ్డారు. దీంతో ఆయన తొంటికి తీవ్ర గాయమైంది. కుటుంబసభ్యులు ఆయనను యశోద ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన డాక్టరు.. తుంటి ఎముక రెండు చోట్ల విరిగినట్లు గుర్తించారు. ఈ రోజు ఆయనకు శస్త్ర చికిత్స చేయనున్నారు. తుంటి ఎముకకు స్టీల్ ప్లేట్స్ వేసే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. తుంటి బాల్ కూడా డ్యామేజ్ అయినట్లు వైద్య బృందం గుర్తించింది. కాగా హాస్పిటల్‌లో కేసీఆర్ వెంట కవిత, కేటీఆర్, హరీష్ రావు ఉన్నారు.