Kunamneni: పొత్తుల కోసం బీఆర్ఎస్ వాళ్ళే మాకు ఫోన్లు చేశారు..

ABN , First Publish Date - 2023-08-22T14:22:31+05:30 IST

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ చేతిలో కమ్యూనిస్టులు మోసపోలేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. ఈ సందర్బంగా మంగళవారం ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ మునుగోడులో బీఆర్ఎస్‌కు మద్దతు ఇవ్వడాన్ని సమర్థించుకున్నారు.

Kunamneni: పొత్తుల కోసం బీఆర్ఎస్ వాళ్ళే మాకు ఫోన్లు చేశారు..

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) చేతిలో కమ్యూనిస్టులు మోసపోలేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు (Kunamneni Sambasivararo) అన్నారు. ఈ సందర్బంగా మంగళవారం ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి (ABN Andhrajyothy)తో మాట్లాడుతూ మునుగోడులో బీఆర్ఎస్‌ (BRS)కు మద్దతు ఇవ్వడాన్ని సమర్థించుకున్నారు. ‘సీఎం కేసీఆర్ ఆయన దారి ఆయన చూసుకున్నారు.. మా దారిలో మేము వెళతాం’ అని అన్నారు. సీఎం కేసీఆర్‌ను నమ్ముకుని తాము రాజకీయాలు చేయటం లేదని కమ్యూనిస్టులు సిద్దాంతంతో నడిచే పార్టీలని అన్నారు. కాంగ్రెస్‌ (Congress)తో కలసి వెళ్ళే దానిపై పార్టీలో చర్చ జరగలేదని, సీపీఐ (CPI), సీపీఎం (CPM)లు ఎన్నికల్లో కలసి పోటీ చేయాలని నిర్ణయించామన్నారు. పొత్తుల కోసం బీఆర్ఎస్ వాళ్ళే మాకు ఫోన్లు చేశారని కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు.

అంతకుముందు లెఫ్ట్ పార్టీల సమావేశం హాట్ హాట్‌గా జరిగింది. విడి విడిగా సీపీఐ, సీపీఎం కార్యవర్గం నేతలు భేటీ అయ్యారు. కూనంనేని, తమ్మినేనిపై ఆయా కార్యవర్గాల నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. పొత్తులు వద్దని ముందే చెప్పినా వినకుండా వెళ్లారని సీపీఐ- సీపీఎం కార్యవర్గం నేతలు అసహనం వ్యక్తం చేశారు. పొత్తులు ఉండవవి కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు ముందే లీకులు ఇచ్చినా మేల్కొలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు సాయంత్రం మరోసారి సీపీఐ, సీపీఎం నేతల ఉమ్మడి సమావేశం నిర్వహించనున్నారు. తర్వాత భవిష్యత్తు కార్యాచరణపై స్పష్టత వచ్చే అవకాశముంది.

Updated Date - 2023-08-22T14:22:31+05:30 IST