TS News: దిశ ఎన్‌కౌంటర్ ఘటనపై హైకోర్టులో విచారణ

ABN , First Publish Date - 2023-04-12T16:26:37+05:30 IST

దిశ ఎన్‌కౌంటర్ (Disha Encounter) ఘటనపై హైకోర్టు (Highcourt)లో విచారణ జరిగింది.

TS News: దిశ ఎన్‌కౌంటర్ ఘటనపై హైకోర్టులో విచారణ

హైదరాబాద్: దిశ ఎన్‌కౌంటర్ (Disha Encounter) ఘటనపై హైకోర్టు (Highcourt)లో విచారణ జరిగింది. ప్రభుత్వం తరఫున లాయర్ నిరంజన్ రెడ్డి వాదనలు వినిపింపించారు. ఎన్‌కౌంటర్ బాధితుల తరపున హైకోర్టులో లాయర్ కృష్ణమాచార్య వాదించారు. ఈ సందర్భంగా లాయర్ కృష్ణమాచార్య మాట్లాడారు. ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న 10 మంది పోలీసులకు హైకోర్టు నోటీసు ఇచ్చిందన్నారు. ఎన్‌కౌంటర్ సమయంలో సీపీగా ఉన్న సజ్జనార్‌కు నోటీస్ అందుకున్నారని పేర్కొన్నారు. నోటీసులో తమ వాదన వినిపించాలని హైకోర్టు పేర్కొందని తెలిపారు. మరోవైపు ఎన్‌కౌంటర్ లో పాల్గొన్న పోలీసులపై సెక్షన్ 302 ప్రకారం కేసు పెట్టాలని హైకోర్టు కోరామన్నారు. బాధిత కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలి అని కూడా కోరినట్లు ఆయన వెల్లడించారు. హైకోర్టు నష్టపరిహారం అంశంలో సానుకూలంగా ఉన్నట్టు అనిపిస్తోందన్నారు. దిశ కేసు తుది ఘట్టానికి చేరుకున్నట్టు తెలుస్తోందని, మరో రెండు వాయిదాల్లో తీర్పు వచ్చే అవకాశం ఉందన్నారు. హైకోర్టు ఈ కేసును జూన్ 21 వాయిదా వేసింది.

Updated Date - 2023-04-12T16:26:37+05:30 IST