Hyderabad: రెజిమెంటల్ బజార్ అగ్ని ప్రమాద ఘటనలో కొత్త ట్విస్ట్..
ABN , First Publish Date - 2023-05-14T07:31:02+05:30 IST
హైదరాబాద్: సికింద్రాబాద్ రెజిమెంటల్ బజార్‌లోని ఓ ఇంట్లో జరిగిన స్వల్ప అగ్ని ప్రమాద (Fire Hazard) ఘటనలో కొత్త ట్విస్ట్ (New Twist) నెలకొంది.
హైదరాబాద్: సికింద్రాబాద్ రెజిమెంటల్ బజార్‌లోని ఓ ఇంట్లో జరిగిన స్వల్ప అగ్ని ప్రమాద (Fire Hazard) ఘటనలో కొత్త ట్విస్ట్ (New Twist) నెలకొంది. అగ్నిప్రమాదం జరిగిన ఇంట్లో కోటి రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇంటి యజమాని శ్రీనివాస్‌గా గుర్తించారు. ఓ ప్రముఖ కంపెనీలో శ్రీనివాస్ డీజీఎంగా పని చేస్తున్నారు. అదే కంపెనీకి సంబంధించిన గవర్నమెంట్ ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్ వ్యాపారం చేస్తున్నారు. అగ్నిప్రమాద సమయంలో ఆయన హైదరాబాద్‌లో లేరు.
అగ్ని ప్రమాదం తర్వాత బెడ్ రూమ్‌లో క్యాష్ సేఫ్‌గా ఉందా లేదా అని చూస్తుండగా పోలీసులకు సమాచారం అందింది. వెంటనే సంఘటన ప్రదేశానికి చేరుకుని తనిఖీలు చేయగా రూ. కోటి 64 లక్షల 45 వేల క్యాష్, బంగారం, వెండి లభ్యమైంది. దీంతో పోలీసులు నగదును సీజ్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. హవాల సొమ్ముగా అనుమానిస్తున్నారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.
కాగా సికింద్రాబాద్ రెజిమెంటల్ బజారులో శనివారం రాత్రి ఓ ఇంట్లో స్వల్ప అగ్నిప్రమాదం జరిగింది. ఇంట్లో ఎవరు లేకపోవడంతో ప్రాణపాయం తప్పింది. ఈ ప్రమాదంలో చెక్క కర్రలు కాలిపోయాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్ధలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.