TRT Notification : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. టీఆర్టీ నోటిఫికేషన్ వచ్చేసింది..
ABN , First Publish Date - 2023-08-24T13:46:09+05:30 IST
నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న డీఎస్సీ నోటిఫికేషన్‌ను ప్రభుత్వం నేడు విడుదల చేసింది. నేడు టీఆర్టీ నోటిఫికేషన్‌ను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 5089 పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుంది. దీనిని డీఎస్సీ ద్వారా విడుదల చేస్తున్నామని సబిత తెలిపారు.
హైదరాబాద్ : నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న డీఎస్సీ నోటిఫికేషన్‌ను ప్రభుత్వం నేడు విడుదల చేసింది. నేడు టీఆర్టీ నోటిఫికేషన్‌ను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 5089 పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుంది. దీనిని డీఎస్సీ ద్వారా విడుదల చేస్తున్నామని సబిత తెలిపారు. రెండు రోజుల్లో నోటిఫికేషన్ విడుదలతో పాటు విధి విధానాలు విడుదల చేస్తామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. తెలంగాణలో వరుస ఉద్యోగాల నోటిఫికేషన్లతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.
టీఎస్‌పీఎస్‌సీ, పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు, ఇతర బోర్డులు వేలాది సంఖ్యలో ఉద్యోగాలకు నోటిఫికేషన్లు, పరీక్షలతో దూసుకెళ్తున్నాయి. అలాగే ప్రభుత్వ ఉద్యోగాల్లో కీలకమైన విద్యాశాఖలో అయితే టీచర్ల ఖాళీలు కూడా కోకొల్లలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 20 వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టులకు ఖాళీలు ఉన్నాయి. నేడు టీఆర్టీ నోటిఫికేషన్ రావడంతో అభ్యర్థులు ఆనందంలో మునిగి తేలుతున్నారు. కాగా.. ఇప్పటికే ప్రభుత్వం ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) నోటిఫికేషన్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. సెప్టెంబరు 15వ తేదీన నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.