Group 1 Prelims Exam: గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష నేడు

ABN , First Publish Date - 2023-06-11T07:50:41+05:30 IST

హైదరాబాద్: రాష్ట్రంలో గ్రూప్‌–1 సర్వీసు ఉద్యోగాల భర్తీకిగాను ప్రిలిమినరీ పరీక్ష ఆదివారం జరగనుంది. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు పరీక్ష జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 994 సెంటర్లలో గ్రూప్1 పరీక్ష జరుగుతుంది.

Group 1 Prelims Exam: గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష నేడు

హైదరాబాద్: రాష్ట్రంలో గ్రూప్‌–1 సర్వీసు ఉద్యోగాల భర్తీకిగాను ప్రిలిమినరీ పరీక్ష ఆదివారం జరగనుంది. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు పరీక్ష జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 994 సెంటర్లలో గ్రూప్1 పరీక్ష జరుగుతుంది. 10.15 గంటల తర్వాత అభ్యర్థులను లోపలకు అనుమతించమని అధికారులు తెలిపారు. కాగా గ్రూప్ 1 కోసం 3,80,072 మంది అభ్యర్థులు దరఖాస్తు చేయగా 3,00,004 మంది అభ్యర్థులు గ్రూప్ 1 హల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు. గతంలో 2,86,051 మంది అభ్యర్థులు గ్రూప్ 1 పరీక్ష రాశారు. గత అక్టోబర్ 16న గ్రూప్ 1 పరీక్ష జరిగింది.

కాగా పేపర్ లీకేజీ నేపథ్యంలో గ్రూప్ 1 ప్రిలిమ్స్‌ను టీఎస్‌పీఎస్సీ (TSPSC) రద్దు చేసింది. ఈసారి ఆఫ్‌లైన్‌ పద్ధతిలో, ఓఎంఆర్‌ విధానంలో పరీక్ష నిర్వహించాలని కమిషన్‌ నిర్ణయించింది. 503 గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి గత ఏడాది ఏప్రిల్‌ 26న నోటిఫికేషన్‌ జారీ చేశారు. అక్టోబర్‌ 16న గ్రూప్ 1 పరీక్ష జరిగింది. 3,80,081 మంది అభ్యర్థులు దరఖాస్తు చేయగా 2,85,916 మంది అభ్యర్థులు హాజరయ్యారు. మెయిన్స్‌ పరీక్షలకు 25,050 మంది అభ్యర్థులను కమిషన్ ఎంపిక చేసింది. అభ్యర్థులు షూలు ధరించి రావొద్దని.. చెప్పులను ధరించే ఎగ్జామ్ సెంటర్లకు రావాలని అధికారులు సూచించారు. గోరింటాకు, టాటూలతో రావొవద్దని స్పష్టం చేసింది. వాచీలు కూడా అనుమతించమని కమిషన్ స్పష్టం చేసింది.

అభ్యర్థులకు సమయం తెలియడం కోసం ప్రతీ అరగంటకు ఓ సారి బెల్ మోగించనున్నట్లు బోర్డు తెలిపింది. అభ్యర్థులు ఎవరైనా నిబంధనలు పాటించకుంటే పరీక్షలు రాయకుండా డిబార్ చేస్తామని కమిషన్ హెచ్చరించింది. ఓఎంఆర్ షీట్ నింపే ముందు ఒకటి రెండు సార్లు నిబంధనలు చదువుకోవాలని అభ్యర్థులకు సూచింది. ఎలాంటి తప్పు చేసినా ఓఎంఆర్‌ను వాల్యుయేషన్ చేయమని బోర్డు అధికారులు చెప్పారు. గ్రూప్-1 పరీక్ష నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ అభ్యర్థుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. బస్టాండ్ల నుంచి పరీక్షా కేంద్రాలకు ప్రత్యేక బస్సులను నడపనుంది.

Updated Date - 2023-06-11T07:50:41+05:30 IST