Group - 4 Exam: తెలంగాణలో గ్రూప్‌ - 4 పరీక్ష ప్రారంభం

ABN , First Publish Date - 2023-07-01T10:01:25+05:30 IST

రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ - 4 పరీక్ష ప్రారంభమైంది. పరీక్ష కోసం టీఎస్‌పీఎస్సీ పగడ్భందీగా ఏర్పాట్లు పూర్తి చేశారు. గ్రూప్ 4 పరీక్షను రెండు పేపర్లతో టీఎస్‌పీఎస్సీ నిర్వహించనుంది. పేపర్‌-1 ఉదయం 10 గంటల నుంచి 12:30 గంటల వరకు, పేపర్‌-2ను మధ్యాహ్నం 2:30 గంటలకు నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నారు. 8,180 పోస్టుల భర్తీ కోసం గ్రూప్‌-4 నోటిఫికేషన్‌ విడుదలవగా.. 9.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. గ్రూప్ - 4 పరీక్ష కోసం రాష్ట్ర వ్యాప్తంగా 2,846 కేంద్రాలను ఏర్పాటు చేశారు.

Group - 4 Exam: తెలంగాణలో గ్రూప్‌ - 4 పరీక్ష ప్రారంభం

హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ - 4 పరీక్ష(Group-4 Exam) ప్రారంభమైంది. పరీక్ష కోసం టీఎస్‌పీఎస్సీ (TSPSC) పగడ్భందీగా ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 9:45 గంటలు దాటిన తర్వాత అభ్యర్థులను లోనికి అనుమతించమని టీఎస్‌పీఎస్సీ స్పష్టం చేసింది. దీంతో సమయం గడిచిన వెంటనే అధికారులు పరీక్ష కేంద్రాల గేట్లను మూసి వేశారు. పలువురు అభ్యర్థులు ఆలస్యంగా రావడంతో వారిని లోనికి అనుమతించేందుకు పోలీసులు నిరాకరించారు. మరోవైపు గ్రూప్ 4 పరీక్షను రెండు పేపర్లతో టీఎస్‌పీఎస్సీ నిర్వహించనుంది. పేపర్‌-1 ఉదయం 10 గంటల నుంచి 12:30 గంటల వరకు, పేపర్‌-2ను మధ్యాహ్నం 2:30 గంటలకు నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నారు. 8,180 పోస్టుల భర్తీ కోసం గ్రూప్‌-4 నోటిఫికేషన్‌ విడుదలవగా.. 9.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. గ్రూప్ - 4 పరీక్ష కోసం రాష్ట్ర వ్యాప్తంగా 2,846 కేంద్రాలను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో తొలిసారి మండల కేంద్రాలలో కూడా పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. వాచ్‌, హ్యాండ్‌ బ్యాగ్‌, పర్సులను పరీక్ష హాల్‌లోకి అనుమతించబోమని టీఎస్‌పీఎస్సీ స్పష్టం చేసింది. అభ్యర్థులు చెప్పులే వేసుకొని పరీక్షకు హాజరుకావాలని టీఎస్సీపీఎస్సీ సూచించింది. పరీక్షకు గతంలో బయోమెట్రిక్‌ ఉండగా, ఈసారి థంబ్‌ విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు. ప్రతీ పరీక్షా కేంద్రంలో థంబ్‌ యంత్రాలను అధికారులు సిద్ధం చేశారు. అభ్యర్థులంతా పరీక్షాకేంద్రానికి రెండు గంటల ముందే చేరుకొని వేలిముద్రలు ఇవ్వాలని టీఎస్‌పీఎస్సీ కోరింది.

40 వేల మంది ఇన్విజిలేటర్లు గ్రూప్‌-4 పరీక్ష విధులు నిర్వర్తించనున్నారు. ఇన్విజిలేటర్లకు టీఎస్‌పీఎస్సీ ఒకరోజు ప్రత్యేక శిక్షణ ఇచ్చింది. పరీక్ష కేంద్రంలోకి ప్రవేశించే ముందు భద్రతా సిబ్బందికి ఒరిజినల్ గుర్తింపు కార్డు చూపాలని అధికారులు కోరారు. అభ్యర్థులు పరీక్ష గదిలోకి చేరుకున్నాక ఇన్విజిలేటర్‌కు ఫొటో గుర్తింపు కార్డు చూపించాలని టీఎస్‌పీఎస్సీ తెలిపింది. అభ్యర్థి కాకుండా వేరే వ్యక్తులు పరీక్షకి హాజరైతే కఠిన చర్యలు ఉంటాయని టీఎస్‌పీఎస్సీ స్పష్టం చేసింది.

Updated Date - 2023-07-01T10:15:17+05:30 IST