Hyderabad: హైదరాబాద్‌లో ఈ ప్రాంతాల వైపు వెళ్లకండి.. మూడు గంటల పాటు భారీ వర్షం..

ABN , First Publish Date - 2023-07-24T18:12:57+05:30 IST

హైదరాబాద్ నగరాన్ని ముసురు వీడడం లేదు. సోమవారం నాడు కూడా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్‌నగర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, యూసఫ్‌గూడ, అమీర్‌పేట్, వెంకటగిరి ప్రాంతాలతో పాటు నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం మొదలైంది.

Hyderabad: హైదరాబాద్‌లో ఈ ప్రాంతాల వైపు వెళ్లకండి.. మూడు గంటల పాటు భారీ వర్షం..

హైదరాబాద్‌ సిటీ (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ నగరాన్ని ముసురు వీడడం లేదు. సోమవారం నాడు సాయంత్రం నుంచి హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్‌నగర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, యూసఫ్‌గూడ, అమీర్‌పేట్, వెంకటగిరి ప్రాంతాలతో పాటు నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం మొదలైంది. వర్షం కారణంగా పంజాగుట్ట నిమ్స్ దగ్గర, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాహనదారులు ప్రత్యామ్నయ మార్గాలను చూసుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. రాగల మూడు గంటలపాటు నగరాన్ని వర్షం ముంచెత్తనుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆఫీసు నుంచి ఇళ్లకు వెళ్లే టైం కావడంతో సిటీలో భారీగా ట్రాఫిక్ జాం కావడంతో వాహనదారులు నరకం చూస్తున్న పరిస్థితి. రోడ్లపై వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఐటీ కారిడార్ ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కుకుంది. రాయదుర్గం, గచ్చిబౌలి, కొండాపూర్, కేబుల్ బ్రిడ్జి మార్గాల్లో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో వాహనదారులు చుక్కలు చూస్తున్న పరిస్థితి ఉంది.


గత సోమవారం రాత్రి మొదలైన చినుకులు నిర్విరామంగా కురుస్తూనే ఉన్నాయి. మధ్యలో కాస్త తెరపినిస్తున్నప్పటికీ.. మళ్లీ వర్షం పడుతూనే ఉంది. దీంతో నగరవాసులు రోజువారీ పనులు చేసుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ఆదివారం పలు ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురిశాయి. సోమ, మంగళవారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. కాగా, ముసురు కారణంగా జంట జలాశయాలకు భారీగా వరద నీరు చేరింది. హిమాయత్‌సాగర్‌ నాలుగు గేట్లను రెండు అడుగుల మేర ఎత్తి 2750 క్యూసెక్కుల నీటిని మూసీలోకి విడుదల చేశారు. వరద ప్రవాహం కారణంగా హిమాయత్‌సాగర్‌ నుంచి రాజేంద్రనగర్‌ వైపు వెల్లే ఓఆర్‌ఆర్‌ సర్వీస్‌ రోడ్డును మూసివేశారు. రెండు వైపులా పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేశారు.

Updated Date - 2023-07-24T18:25:03+05:30 IST