TS High Court: కానిస్టేబుల్‌ నియామకాలకు హైకోర్టు బ్రేక్

ABN , First Publish Date - 2023-10-09T22:42:34+05:30 IST

కానిస్టేబుల్‌ నియామకాల(Constable Appointments)కు తెలంగాణ హైకోర్టు(Telangana High Court) బ్రేక్ వేసింది. తుది పరీక్ష నుంచి 4 ప్రశ్నలు తొలగించాలని హైకోర్టు ఆదేశించింది.

TS High Court: కానిస్టేబుల్‌ నియామకాలకు హైకోర్టు బ్రేక్

హైదరాబాద్: కానిస్టేబుల్‌ నియామకాల(Constable Appointments)కు తెలంగాణ హైకోర్టు(Telangana High Court) బ్రేక్ వేసింది. తుది పరీక్ష నుంచి 4 ప్రశ్నలు తొలగించాలని హైకోర్టు ఆదేశించింది. అందరికీ 4 మార్కులు కలిపి ఫలితాలు వెల్లడించాలని తెలిపింది. ఆ తర్వాతే నియామక ప్రక్రియ చేపట్టాలని పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డుకు హైకోర్టు ఆదేశించింది. 122, 130, 144 ప్రశ్నలను తెలుగులోకి అనువదించలేదని, 57 ప్రశ్న తప్పుగా ఉన్నందున వాటిని ప్రశ్నపత్రం నుంచి తొలగించాలని ఆదేశించింది. 2022, ఆగస్టు 30వ తేదీన దాదాపు 23 ప్రశ్నలకు అభ్యంతరాలు తెలుపుతూ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలు అయ్యాయి. తుది ఫలితాలను పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు వారం క్రితం ప్రకటించింది. 15,750 మంది పోస్టులకు సంబంధించిన అభ్యర్థుల జాబితాను ఇప్పటికే విడుదల చేసింది. 12,866 మంది పురుషులు, 2,884 మంది మహిళా అభ్యర్థులు ఎంపిక చేసింది. తాజా హైకోర్టు తీర్పుతో మళ్లీ ఫలితాలు వెల్లడించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ రెండుసార్లు రద్దు చేసింది. తాజాగా కానిస్టేబుల్‌ పరీక్ష ఫలితాలపై హైకోర్టు తీర్పు వెలువరించడంతో అభ్యర్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంలో పడింది.

Updated Date - 2023-10-09T22:42:53+05:30 IST