T.Highcourt: సాయిసింధు ఫౌండేషన్‌కు భూ కేటాయింపును రద్దు చేసిన హైకోర్టు
ABN , First Publish Date - 2023-06-05T14:07:11+05:30 IST
రాజ్యసభ సభ్యుడు పార్థసారథి రెడ్డికి చెందిన సాయిసింధు ఫౌండేషన్‌కు భూ కేటాయింపును తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది. క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణం కోసం సాయి సింధు ఫౌండేషన్‌కు ప్రభుత్వం భూమిని కేటాయించింది.
హైదరాబాద్: రాజ్యసభ సభ్యుడు పార్థసారథి రెడ్డికి చెందిన సాయిసింధు ఫౌండేషన్‌కు భూ కేటాయింపును తెలంగాణ హైకోర్టు (Telangana Highcourt) రద్దు చేసింది. క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణం కోసం సాయి సింధు ఫౌండేషన్‌కు ప్రభుత్వం భూమిని కేటాయించింది. సాయి సింధు ఫౌండేషన్‌కు ఖానామెట్ వద్ద 2018లో 15 ఎకరాలను సర్కార్ కేటాయించింది. హెటిరో చైర్మన్ పార్థసారథి రెడ్డి సాయి సింధు ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీగా ఉన్నాయి. అయితే ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవాల్ చేస్తూ 2019లో హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. రైట్ సొసైటీ, ఊర్మిళ, సురేష్ కుమార్ ఈ పిల్స్‌ను దాఖలు చేశారు. ఈరోజు ఈ పిటిషన్లు హైకోర్టులో విచారణకు రాగా... సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ విజయ్‌సేన్ రెడ్డి ధర్మాసనం తీర్పును వెల్లడించింది. సాయిసింధు ఫౌండేషన్‌కు భూ కేటాయింపు జీవోను హైకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. భూ కేటాయింపుల విధానానికి అనుగుణంగా పునః పరిశీలించాలని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది.