Navadeep : నవదీప్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ
ABN , First Publish Date - 2023-09-20T12:46:17+05:30 IST
హీరో నవదీప్ పిటిషన్‌పై హై కోర్టులో విచారణ జరిగింది. నవదీప్‌పై గతంలోనూ డ్రగ్స్ కేసులు ఉన్నాయని హై కోర్టుకు పోలీసులు తెలిపారు. గతంలో ఉన్న డ్రగ్స్ కేసుల్లో నవదీప్ నిందితుడిగా లేడని అడ్వకేట్ సిద్దార్థ్ వాదించారు.
హైదరాబాద్ : హీరో నవదీప్ పిటిషన్‌పై హై కోర్టులో విచారణ జరిగింది. నవదీప్‌పై గతంలోనూ డ్రగ్స్ కేసులు ఉన్నాయని హై కోర్టుకు పోలీసులు తెలిపారు. గతంలో ఉన్న డ్రగ్స్ కేసుల్లో నవదీప్ నిందితుడిగా లేడని అడ్వకేట్ సిద్దార్థ్ వాదించారు. గతంలోనూ దర్యాప్తు సంస్థల ముందు నవదీప్ హాజరయ్యారని నవదీప్ అడ్వకేట్ సిద్దార్థ్ తెలిపారు. మాదాపూర్ డ్రగ్స్ కేస్ లో నవదీప్‌కు ఎలాంటి సంబంధం లేదని అడ్వకేట్ తెలిపారు. ఈ కేసులో 41 ఏ కింద నోటీస్ ఇవ్వాలని పోలీసులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 41 నోటీస్ ఇచ్చి విచారించాలని హైకోర్టు ఆదేశించింది. నవదీప్ పిటిషన్‌ను హైకోర్టు డిస్పోజ్ చేసింది.