T.Highcourt: తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
ABN , First Publish Date - 2023-11-07T16:25:53+05:30 IST
తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్‌కు స్థలాన్ని కేటాయించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వానికి (Telangana Government) హైకోర్టు (Highcourt) నోటీసులు జారీ చేసింది. ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్‌కు స్థలాన్ని కేటాయించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. రూ.3.70 కోట్ల రూపాయల స్థలాన్ని ప్రభుత్వం జీవో విడుదల చేసి ఆర్బిట్రేషన్‌కు ఉచితంగా ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ న్యాయవాది కోటి రఘునాథ్ రావు పిటిషన్ దాఖలు చేశారు. రాయదుర్గ, శేర్లింగంపల్లి మండల పరిధిలో ఆర్బిట్రేషన్‌కు మూడెకరాల స్థలాన్ని ప్రభుత్వం కేటాయిస్తూ జీవో జారీ చేసింది. అయితే ఎలాంటి డబ్బులు తీసుకోకుండా ఆర్బిట్రేషన్‌కు స్థలాన్ని ఇవ్వడంపై పిటిషనర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆర్బిట్రేషన్‌కు స్థలాన్ని కేటాయిస్తూ ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 126పై స్టే ఇవ్వాలని కోర్టును పిటిషన్‌ర్లు కోరారు. పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు... తెలంగాణ ప్రభుత్వానికి కోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను నవంబర్ 21కి హైకోర్టు వాయిదా వేసింది.