Hyderabad: అరుదైన శస్త్రచికిత్స చేసి చిన్నారికి ప్రాణదానం కాపాడిన గాంధీ వైద్యులు
ABN , First Publish Date - 2023-04-19T12:32:17+05:30 IST
ఓ చిన్నారికి అరుదైన శస్త్ర చికిత్స చేసి ప్రాణదానం చేశారు గాంధీ ఆస్పత్రి వైద్యులు. చిన్నారిలో మూత్రపిండాలకు సంబంధించిన ట్యూమర్‌ను తొలగించే ఆపరేషన్‌ను..
ఓ చిన్నారికి అరుదైన శస్త్ర చికిత్స చేసి ప్రాణదానం చేశారు గాంధీ ఆస్పత్రి వైద్యులు. చిన్నారిలో మూత్రపిండాలకు సంబంధించిన ట్యూమర్‌ను తొలగించే ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేశారు.
హైదరాబాద్: విల్మ్స్ కణితితో ఇబ్బంది పడుతున్న తొమ్మిది నెలల చిన్నారికి గాంధీ ఆస్పత్రి వైద్యులు అరుదైన శస్త్రచికిత్స(Rare Surgery) చేశారు. కర్నూలు జిల్లా డోన్(Kurnool District Don) గ్రామానికి చెందిన సలీం కుటుంబసభ్యులతో కలిసి చింతల్(Chintal)లో ఉంటున్నాడు. అతడి కుమార్తె (తొమ్మిది నెలలు) అరుదైన వ్యాధితో బాధపడుతోంది.
వైద్యం కోసం కార్పొరేట్ ఆస్పత్రుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో ఈ ఏడాది మార్చి 29న గాంధీ ఆస్పత్రి(Gandhi Hospital)లో చేర్పించారు. చిన్నపిల్లల సర్జరీ విభాగం హెచ్‌ఓడీ నాగార్జున ఆధ్వర్యంలో యూరాలజీ ప్రొఫెసర్(Professor of Urology) డాక్టర్ రవిచందర్, డాక్టర్ శ్రీనివాస్, కమిమోజి, ఇలక్కియా, ఏ.రాజ్ కిరణ్, కే.ఫణీంద్ర, మురళి చిన్నారికి పలు వైద్య పరీక్షలు చేసి విల్మ్స్ కణితి ఉన్నట్లు గుర్తించారు. నిపుణుల వైద్య బృందం పర్యవేక్షణలో శస్త్రచికిత్సను విజయవంతం నిర్వహించారు.
డిశ్చార్జి అయిన తరువాత చిన్నారి ఎంఎన్‌జే ఆస్పత్రిలో కీమోథెరపీ ద్వారా చికిత్స పొందుతోంది. తమ కుమార్తెకు పునర్జన్మనిచ్చిన వైద్యబృందానికి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.