Hyderabad: డ్రంకెన్ డ్రైవ్‌లో జైలుశిక్ష వేసినా మారలేదు..ఈసారి కోర్టు ఏం శిక్ష వేసిందో తెలుసా ?

ABN , First Publish Date - 2023-04-01T12:01:11+05:30 IST

హైదరాబాద్: మద్యం మత్తులో వాహనాలు నడుపొద్దని పోలీసులు ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టినా.. వాహనదారుల తీరు మారడంలేదు. డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడి జైలుకెళ్ళొచ్చినా బుద్ధి మారడంలేదు. ఓ ఆటోడ్రైవర్ డ్రైవ్‌లో పట్టుబడి మూడు రోజులు జైలుకెళ్లాడు. అయినా తీరు మార్చుకోకుండా మళ్లీ మద్యం తాగి ఆటో నడుపుతూ పోలీసులకు చిక్కాడు. బంజారాహిల్స్‌ ట్రాఫిక్‌ పోలీసులు ఈ నెల 12న డ్రంకెన్‌ డ్రైవ్‌లో భాగంగా వాహనాలు తనిఖీ చేస్తుండగా ఆసిఫ్‌నగర్‌కు చెందిన బి.వెంకటరమణ మద్యం మత్తులో ఆటో నడుపుతూ దొరికాడు. శ్యాస పరీక్ష చేయగా 339 బీఏసీ వచ్చింది. గతేడాది ఆగస్టులో కూడా డ్రంకెన్‌ డ్రైవ్‌లో పట్టుబడి మూడు రోజులు జైలుకు వెళ్లి వచ్చాడు. అయినా, తీరు మార్చుకోకుండా మరోసారి డ్రంకెన్‌ డ్రైవ్‌ చేస్తూ దొరకడంతో పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు. జైలు శిక్ష, డ్రైవింగ్‌ లైసెన్స్‌ రద్దుతోపాటు రూ.2,100 జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు.

Hyderabad: డ్రంకెన్ డ్రైవ్‌లో జైలుశిక్ష వేసినా మారలేదు..ఈసారి కోర్టు ఏం శిక్ష వేసిందో తెలుసా ?

హైదరాబాద్: మద్యం మత్తులో వాహనాలు నడుపొద్దని పోలీసులు ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టినా.. వాహనదారుల తీరు మారడంలేదు. డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడి జైలుకెళ్ళొచ్చినా బుద్ధి మారడంలేదు. ఓ ఆటోడ్రైవర్ డ్రైవ్‌లో పట్టుబడి మూడు రోజులు జైలుకెళ్లాడు. అయినా తీరు మార్చుకోకుండా మళ్లీ మద్యం తాగి ఆటో నడుపుతూ పోలీసులకు చిక్కాడు.

బంజారాహిల్స్‌ ట్రాఫిక్‌ పోలీసులు ఈ నెల 12న డ్రంకెన్‌ డ్రైవ్‌లో భాగంగా వాహనాలు తనిఖీ చేస్తుండగా ఆసిఫ్‌నగర్‌కు చెందిన బి.వెంకటరమణ మద్యం మత్తులో ఆటో నడుపుతూ దొరికాడు. శ్యాస పరీక్ష చేయగా 339 బీఏసీ వచ్చింది. గతేడాది ఆగస్టులో కూడా డ్రంకెన్‌ డ్రైవ్‌లో పట్టుబడి మూడు రోజులు జైలుకు వెళ్లి వచ్చాడు. అయినా, తీరు మార్చుకోకుండా మరోసారి డ్రంకెన్‌ డ్రైవ్‌ చేస్తూ దొరకడంతో పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు. జైలు శిక్ష, డ్రైవింగ్‌ లైసెన్స్‌ రద్దుతోపాటు రూ.2,100 జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు.

Updated Date - 2023-04-01T12:02:25+05:30 IST