T.Highcourt: వరద నష్టం, పరిహారంపై తెలంగాణ హైకోర్టులో విచారణ.. సర్కార్‌పై అసంతృప్తి

ABN , First Publish Date - 2023-08-04T14:12:20+05:30 IST

తెలంగాణ రాష్ట్రంలో వరద నష్టం, పరిహారంపై హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది.

T.Highcourt: వరద నష్టం, పరిహారంపై తెలంగాణ హైకోర్టులో విచారణ.. సర్కార్‌పై అసంతృప్తి

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో వరద నష్టం, పరిహారంపై హైకోర్టులో (Telangana High Court) శుక్రవారం విచారణ జరిగింది. వరద నష్టంపై సమగ్ర నివేదికను సమర్పించడానికి హైకోర్టును ప్రభుత్వం (Telangana Government) మరో రెండురోజుల పాటు గడువు కోరింది. వరద ప్రభావిత భాదితులకు వెంటనే పరిహారం, సహాయక చర్యలు చేపట్టేలా ఆదేశించాలని పిటిషనర్ కోరారు. అయితే ప్రభుత్వ నివేదిక పరిశీలించిన తరువాత ఆదేశాలిస్తామని న్యాయస్థానం తెలియజేసింది. తదుపరి విచారణను హైకోర్టు సోమవారానికి (ఆగష్టు 7)కు వాయిదా వేసింది. గతంలో ప్రభుత్వం సమర్పించిన రిపోర్ట్‌పై న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది. నివేదిక ఇవ్వడానికి ఎందుకు సమయం తీసుకుంటున్నారని చీఫ్ జస్టిస్ ప్రశ్నించారు. సోమవారంలోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను హైకోర్టు వాయిదా వేసింది.

Updated Date - 2023-08-04T14:12:20+05:30 IST