TSPSC Leakage: టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజ్‌పై హైకోర్టులో విచారణ మొదలు

ABN , First Publish Date - 2023-03-21T13:23:28+05:30 IST

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీపై మంగళవారం హైకోర్టులో విచారణ మొదలైంది.

TSPSC Leakage: టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజ్‌పై హైకోర్టులో విచారణ మొదలు

హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ (TSPSC Paper leakage) పై మంగళవారం హైకోర్టు (Telangana High Court) లో విచారణ మొదలైంది. ఈ కేసును సీబీఐ (CBI) లేదా సిట్టింగ్ జడ్జ్‌తో విచారించాలంటూ అభ్యర్థులతో పాటు ఎన్ఎస్‌యుఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పిటిషనర్ల తరుపున సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్ వివేక్ ధన్కా (Supreme Court Senior Counsel Vivek Tanka) వాదనలు వినిపిస్తున్నారు.

ధన్కా వాదనలు ఇవి....

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ దర్యాప్తు ఇంకా కొనసాగుతుండగానే ఇద్దరు మాత్రమే నిందితులు అని ఐటీ మినిస్టర్ కేటీఆర్ (IT Minister KTR) చెబుతున్నారని... ఇందులో కుట్ర కోణం దాగి ఉందన్నారు. ఒకే మండలంలో 20 మందికి మంచి మార్కులు వచ్చాయని... దీనిపై కూడా అనుమానాలు ఉన్నాయని తెలిపారు. ఈ కేసు సీబీఐకి అప్పగిస్తే నిజనిజాలు బయట పడతాయని తన్క వాదనలు వినిపించారు. ఇప్పటి వరకు ఏఈ, గ్రూప్ 1, ఏఈఈ, డీఏవో పరీక్షలను టీఎస్‌పీఎస్సీ బోర్డ్ రద్దు చేసిందన్నారు. టీఎస్‌పీఎస్సీ లీకేజీలో సమగ్ర విచారణ జరపాలని కోరారు. ఐటీ మినిస్టర్ స్వయాన కేవలం ఇద్దరు నిందితులకు మాత్రమే సంబంధం ఉంది అని చెప్పారని... కేసు మొదటి దశలోనే ఇద్దరి ప్రమేయం మాత్రమే ఉంది అని ఎలా చెపుతారని ప్రశ్నించారు.

ఇక్కడి పోలీసులపై నమ్మకం లేదు, సీబీఐ ద్వారానే విచారణ జరగాలని కోర్టుకు తెలిపారు. టీఎస్‌పీఎస్సీ క్వాలిఫై అయిన అభ్యర్థుల వివరాలు అధికారిక వెబ్‌ సైట్‌లో ఎందుకు పెట్టలేదని అడిగారు. టీఎస్‌పీఎస్సీ అంత రహస్యంగా అభ్యర్థుల వివరాలు ఎందుకు ఉంచుతోందని అన్నారు. ఒకే మండలం నుంచి 20 మంది అభ్యర్థులు అత్యధిక మార్కులతో క్వాలిఫై అయ్యారని... ఇందులో చాలా అనుమానాలు ఉన్నాయని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. సీబీఐ, లేక ఇతర స్వతంత్ర దర్యాప్తు సంస్థతో దర్యాప్తు జరిపించాలని వినతి చేశారు. గతంలో వ్యాపమ్ స్కాంలో సీబీఐకి సుప్రీంకోర్టు అప్పగించిందని చెబుతూ... మధ్యప్రదేశ్ వ్యాపమ్ స్కాం జడ్జిమెంట్ కాపీని వివేక్ ధన్కా హైకోర్టుకు సమర్పించారు.

వివేక ధన్కా వాదనలు ముగిసిన అనంతరం ప్రభుత్వం తరుపు ఏజీ వాదనలు మొదలయ్యాయి. అడ్వకేట్ జనరల్ వాదనలు విపిస్తున్నారు. కాగా.. టీఎస్‌పీఎస్పీ పేపర్ లీకేజ్ పిటిషన్ అత్యవసరంగా విచారించాలని పిటిషనర్ తరపు న్యాయవాదులు కోర్టును కోరారు. అయితే మధ్యాహ్నం 12:30 గంటలకు విచారిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజ్‌పై జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి విచారణ జరుపుతున్నారు.

Updated Date - 2023-03-21T14:13:51+05:30 IST