IT Raids : క్రిస్టియన్ మిషనరీలపై ఐటీ సడెన్ రైడ్స్..

ABN , First Publish Date - 2023-03-15T10:11:17+05:30 IST

హైదరాబాద్‌లో మరోసారి ఐటీ దాడులకు పూనుకుంది. నేడు పలు ప్రాంతాల్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి.

IT Raids : క్రిస్టియన్ మిషనరీలపై ఐటీ సడెన్ రైడ్స్..

హైదరాబాద్ : హైదరాబాద్‌లో మరోసారి ఐటీ దాడులకు పూనుకుంది. నేడు పలు ప్రాంతాల్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా క్రిస్టియన్ మిషనరీలతో పాటు పలు సంస్థలపై ఐటీ అధికారులు సడెన్‌గా దాడులు ప్రారంభించారు. తెలంగాణలోని 40 ప్రాంతాల్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. అల్వాల్, బొల్లారం, కీసర, జీడిమెట్ల, మెదక్, పటాన్‌చెరులో ఐటీ తనిఖీలు నిర్వహిస్తున్నారు. మొత్తం 9 సంస్థల్లో సోదాలు కొనసాగుతున్నాయి. బాలవికాస్ ఫౌండేషన్‌లో ఐటీ దాడులు నిర్వహిస్తోంది. 2016లో బాలవికాస్ ఫౌండేషన్ ఏర్పాటైంది. రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్‌లో ఎన్‌జీవోగా బాల వికాస్ రిజిస్టర్ అయ్యింది. కాగా.. ఇటీవలి కాలంలో ఐటీ హైదరాబాద్ కేంద్రంగా ఐటీ దాడులను ముమ్మరం చేసింది. పలు సంస్థలపై దాడులు నిర్వహిస్తోంది. కొద్ది రోజుల క్రితమే గూగి కంపెనీపై ఐటీ దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే.

Updated Date - 2023-03-15T10:11:17+05:30 IST