Mukkoti Ekadashi: రంగనాథస్వామికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి తలసాని
ABN , First Publish Date - 2023-01-02T12:11:18+05:30 IST
ముక్కోటి ఏకాదశి సందర్భంగా జియాగూడా రంగనాధ స్వామి ఆలయంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.
హైదరాబాద్: ముక్కోటి ఏకాదశి సందర్భంగా జియాగూడా రంగనాథ స్వామి ఆలయంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దంపతులు (Minister Talasani Srinivas Yadav couple) స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయానికి వచ్చిన మంత్రి దంపతులకు పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. మంత్రి శ్రీనివాస్ యాదవ్ దంపతులు రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.