KTR: 6 నెలలు తప్పించుకున్నారుగా? ..: కౌంటర్లు స్టార్ట్ చేసిన కేటీఆర్
ABN , First Publish Date - 2023-12-12T12:11:58+05:30 IST
మాజీ మంత్రి కేటీఆర్ సెటైర్లు వేశారు. కౌలు రైతులను ఎలా గుర్తిస్తారో.. పైసలు ఎట్లా వేస్తారో చూద్దామనుకుంటే 6 నెలలు తప్పించుకున్నారుగా? అంటూ ‘ఎక్స్’ వేదికగా ఎద్దేవా చేశారు. 22 లక్షల మంది కౌలు రైతులకు పెట్టుబడి లేనట్టేనా యాసంగికి అని విమర్శలు గుప్పిస్తున్నారు
హైదరాబాద్ : మాజీ మంత్రి కేటీఆర్ సెటైర్లు వేశారు. కౌలు రైతులను ఎలా గుర్తిస్తారో.. పైసలు ఎట్లా వేస్తారో చూద్దామనుకుంటే 6 నెలలు తప్పించుకున్నారుగా? అంటూ ‘ఎక్స్’ వేదికగా ఎద్దేవా చేశారు. 22 లక్షల మంది కౌలు రైతులకు పెట్టుబడి లేనట్టేనా యాసంగికి అని విమర్శలు గుప్పిస్తున్నారు. మళ్లీ ఒక బహిరంగ లేఖ రాస్తాడా ముఖ్యమంత్రి..? అని విమర్శించారు.
యాసంగి సీజన్‌కు సంబంధించి రైతుబంధు నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసే ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఏ ఒక్క రైతుకూ ఇబ్బంది కలగకుండా మంగళవారం నుంచిపెట్టుబడి సాయం పంపిణీ చేయాలని సూచించారు. వ్యవసాయ శాఖపై సచివాలయంలో సోమవారం ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగానే రైతుబంధు పంపిణీపై ఆదేశాలిచ్చారు.