Metro Passengers : మెట్రో ప్రయాణికులపై చలాన్ల వర్షం కురిపిస్తున్న ట్రాఫిక్ పోలీసులు
ABN , First Publish Date - 2023-04-12T10:58:45+05:30 IST
రాచకొండ, సైబారాబాద్ కమిషనరేట్స్‌లలోని మెట్రో స్టేషన్ వద్ద ట్రాఫిక్ పోలీసుల చలాన్లు బాదుడు మరింత ఎక్కువైంది. మెట్రోస్టేషన్స్ దగ్గర ట్రాఫిక్ పోలీసులకు కాసుల వర్షం కురుస్తోంది. మెట్రో స్టేషన్స్ వద్ద సరిపోను పార్కింగ్ లేక ప్రయాణికుల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
హైదరాబాద్ : రాచకొండ, సైబారాబాద్ కమిషనరేట్స్‌లలోని మెట్రో స్టేషన్ వద్ద ట్రాఫిక్ పోలీసుల చలాన్లు బాదుడు మరింత ఎక్కువైంది. మెట్రోస్టేషన్స్ దగ్గర ట్రాఫిక్ పోలీసులకు కాసుల వర్షం కురుస్తోంది. మెట్రో స్టేషన్స్ వద్ద సరిపోను పార్కింగ్ లేక ప్రయాణికుల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పార్కింగ్ సరిపోను లేకపోవడంతో ప్రయాణికులు స్టేషన్ పరిసర ప్రాంతాల్లోని ఖాళీ స్థలాల్లో వాహనాలను పార్కింగ్ చేస్తున్నారు. ఇదే అదునుగా పార్క్ చేసిన వాహనాలకు చలాన్లను పోలీసులు బాదేస్తున్నారు. వరుస ట్రాఫిక్ చలాన్లతో మెట్రో ప్రయాణికులు బెంబేలు ఎత్తుతున్నారు. ఏదో ట్రాఫిక్ ఇక్కట్లు లేకుండా ప్రశాంతంగా ప్రయాణం సాగించవచ్చని కాస్త రేటు ఎక్కువైనా సరే జనం మెట్రోను ఆశ్రయిస్తున్నారు. తమ ఇంటి నుంచి బైక్‌పై వచ్చి మెట్రో స్టేషన్ వద్ద పార్క్ చేసి మెట్రోలో వెళుతున్నారు. దీంతో మెట్రో స్టేషన్ వద్ద పార్కింగ్ చాలా ఇబ్బందికరంగా మారింది. చేసేదేమీ లేక ఖాళీ స్థలం ఎక్కడైనా కనిపిస్తే అక్కడ బైక్‌ను పార్క్ చేసుకుని వెళుతున్నారు. దీనిని అడ్వాంటేజ్‌గా తీసుకుని ట్రాఫిక్ పోలీసులు చలాన్లు బాదేస్తున్నారు. ఒకటేమిటి సిటీలోని అన్నీ మెట్రో స్టేషన్స్‌లో దాదాపు ఇదే పరిస్థితి. ఎల్బీనగర్ టూ మియాపూర్ మధ్య పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఎల్బీనగర్, చైతన్య పురి, విక్టోరియా, దిల్‌సుఖ్‌గర్ స్టేషన్లలో పార్కింగ్ ఇక్కట్లు మరి తీవ్రంగా మారాయి.