Minister Talasani: ‘సనత్‌నగర్‌ బాలుడి మృతి బాధాకరం’

ABN , First Publish Date - 2023-04-21T10:51:03+05:30 IST

నగరంలోని సనత్‌నగర్‌లో ఎనిమిదేళ్ల బాలుడి మృతిపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు.

Minister Talasani: ‘సనత్‌నగర్‌ బాలుడి మృతి బాధాకరం’

హైదరాబాద్: నగరంలోని సనత్‌నగర్‌లో ఎనిమిదేళ్ల బాలుడి మృతిపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani Srinivas yadav) స్పందించారు. బాలుడి మృతి చాలా బాధాకరమని ఆవేదన చెందారు. ఈ విషయం తెలిసిన వెంటనే మంత్రి పోలీసుల అధికారులతో మాట్లాడి విషయం తెలుసుకున్నారు. దోషులు ఎంతటి వారైనా చట్టపరంగా కఠినంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని మంత్రి హామీ ఇచ్చారు.

సనత్‌నగర్‌లోని అల్లాఉద్దీన్ కోటికి చెందిన అబ్దుల్ వాహిద్ దారుణ హత్యకు గురయ్యాడు. అమావాస్య వేళ బాలుడిని ఇమ్రాన్ అనే హిజ్రా బలి ఇచ్చినట్లుగా స్థానికులు ఆరోపిస్తున్నారు. గతరాత్రి ఓ ప్రాంతంలో క్షుద్రపూజలు జరిగినట్లు గుర్తించారు. పక్కనే ఉన్న నాలా సమీపంలో బాలుడి మృతదేహం లభ్యమైంది. దీంతో హిజ్రానే బాలుడిని చంపాడంటూ కోపంతో ఊగిపోయిన స్థానికులు హిజ్రా ఇంటిపై దాడి చేసి ధ్వంసం చేశారు. స్థానికుల ఆందోళనతో సనత్‌నగర్‌లోని అల్లాదున్ కోటి ఏరియాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2023-04-21T10:51:03+05:30 IST