MLA Anil Kumar Yadav : హైదరాబాద్‌లో రెచ్చిపోయిన ఎమ్మెల్యే అనిల్.. సెక్యూరిటీ సిబ్బంది అని కూడా చూడకుండా..

ABN , First Publish Date - 2023-06-30T10:16:05+05:30 IST

అపార్ట్‌మెంట్ సెక్యూరిటీ సిబ్బంది విధుల్లో ఒకటి అపార్ట్‌మెంట్ ముందు వాహనాలేవీ పార్క్ చేయకుండా చూడటం.. తద్వారా అపార్ట్‌మెంటు వాసులకు ఇబ్బంది కలగకుండా చూడటం. అదే పని చేసినందుకు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ సెక్యూరిటీ సిబ్బందిపై దాడి చేయించారు. హైదరాబాద్‌లో అనిల్ తన అనుచరులతో కలిసి వీరంగం సృష్టించారు.

MLA Anil Kumar Yadav : హైదరాబాద్‌లో రెచ్చిపోయిన ఎమ్మెల్యే అనిల్.. సెక్యూరిటీ సిబ్బంది అని కూడా చూడకుండా..

హైదరాబాద్ : అపార్ట్‌మెంట్ సెక్యూరిటీ సిబ్బంది విధుల్లో ఒకటి.. అపార్ట్‌మెంట్ ముందు వాహనాలేవీ పార్క్ చేయకుండా చూడటం.. తద్వారా అపార్ట్‌మెంటు వాసులకు ఇబ్బంది కలగకుండా చూడటం. అదే పని చేసినందుకు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ సెక్యూరిటీ సిబ్బందిపై దాడి చేయించారు. హైదరాబాద్‌లో అనిల్ తన అనుచరులతో కలిసి వీరంగం సృష్టించారు.

హైదరాబాద్‌లో ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ తన అనుచరులతో కలిసి రెచ్చిపోయారు. ఓ అపార్ట్‌మెంట్ వద్ద సెక్యూరిటీ గార్డుపై ఆయన అనుచరులు ప్రతాపం చూపించడం కలకలం రేపింది. గచ్చిబౌలి - అపర్ణ సెరెన్ అపార్ట్‌మెంట్‌లో పార్కింగ్ వివాదం చోటు చేసుకుంది. అపార్ట్‌మెంటు రోడ్డుపై పార్కింగ్ చేయవద్దని సెక్యూరిటీ సూచించారు. దీంతో అనిల్ మనుషులు రెచ్చిపోయారు. ఎమ్మెల్యే ఆదేశాలతో అపార్ట్‌మెంట్ సెక్యూరిటీపై తమ ప్రతాపం చూపించారు. ఇద్దరు సెక్యూరిటీ సిబ్బందిని తన మనుషులతో చితకబాదించారు. ఈ తతంగం మొత్తాన్ని అపార్ట్‌మెంట్ వాసులు వీడియో తీశారు. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Updated Date - 2023-06-30T10:29:24+05:30 IST