FIR: షర్మిల ఎఫ్‌ఐఆర్‌లో ఉన్నది ఇదే..
ABN , First Publish Date - 2023-04-25T11:03:09+05:30 IST
హైదరాబాద్: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila)పై పోలీసులు ఎఫ్‌ఐఆర్ (FIR) నమోదు చేశారు. అందులో ఏముందంటే..
హైదరాబాద్: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila)పై పోలీసులు ఎఫ్‌ఐఆర్ (FIR) నమోదు చేశారు. అందులో ఏముందంటే.. సిట్ (SIT) ఆఫిస్‌కు వెళ్లేందుకు షర్మిల ఎలాంటి అనుమతి తీసుకోలేదని.. సిట్ కార్యాలయం ముందు ధర్నా చేసేందుకు షర్మిలా ప్లాన్ చేశారని.. అక్కడ ధర్నాకు ఎలాంటి అనుమతి తీసుకోలేదని.. అందుకే హౌస్ అరెస్ట్ చేశామని పోలీసులు పేర్కొన్నారు.
ఈ క్రమంలో షర్మిల సోమవారం ఉదయం 10:45 గంటలకు ఇంట్లో నుంచి బయటికి వచ్చి వాహనంలో కూర్చున్నారని, తాము ఆపేందుకు ప్రయత్నించినా తమపై వాహనం ఎక్కించారని ఎస్ఐ పేర్కొన్నారు. మేము ఆపడంతో కిందకి దిగి మహిళా పోలీసులను నెట్టేశారని అన్నారు. తర్వాత పక్కనే ఉన్న ఫార్చ్యూనర్ కారు ఎక్కారని, అక్కడా కూడా ఆమె డ్రైవర్ బాబును రెచ్చగొట్టి తమపై కారు ఎక్కెలా షర్మిల ప్రవర్తించారని.. కిందికి దిగి తనపై, లేడీ కానిస్టేబుల్‌పై చేయి చేసుకున్నారన్నారు. తన చేతిలో ఉన్న హ్యాండ్ సెట్ దౌర్జన్యంగా తీసుకున్నారని, యూనిఫారంపై ఉన్న నేమ్ ప్లేట్ రోడ్ మీద పడేసారని ఎస్ఐ పేర్కొన్నారు.
షర్మిల (Sharmila) దాడి ఘటనపై పోలీసులు సీరియస్ (Police Serious) అయ్యారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో వైఎస్ షర్మిలపై కేసు నమోదు చేశారు. విధుల్లో ఉన్న ఎస్ఐ (SI), కానిస్టేబుల్ (Conistable)పై షర్మిల చేయిచేసుకోవడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఐపీసీ 332, 353 సెక్షన్ల కింద షర్మిలపై కేసు నమోదు చేసి.. అరెస్టు (Arrest) చేసి బంజారాహిల్స్ పీఎస్‌కు తరలించారు. అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. విచారణ జరిపిన న్యాయస్థానం షర్మిలకు 14 రోజులు రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు ఆమెను చర్లపల్లి జైలుకు తరలించారు.