Secunderabad: భారీ దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు

ABN , First Publish Date - 2023-07-12T14:31:17+05:30 IST

హైదరాబాద్: సికింద్రాబాద్‌లో జరిగిన భారీ దోపిడీ కేసును పోలీసులు చేధించారు. దోపిడీకి పాల్పడిన నేపాలీ గ్యాంగ్‌ను పోలీసులు ముంబైలో అదువులోకి తీసుకున్నారు. నిందితులు ముంబై మీదుగా నేపాల్ పరిపోయేందుకు ప్రయత్నం చేయగా..

Secunderabad: భారీ దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు

హైదరాబాద్: సికింద్రాబాద్‌లో జరిగిన భారీ దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. దోపిడీకి పాల్పడిన నేపాలీ గ్యాంగ్‌ను పోలీసులు ముంబైలో అదువులోకి తీసుకున్నారు. నిందితులు ముంబై మీదుగా నేపాల్ పరిపోయేందుకు ప్రయత్నం చేయగా.. ముంబై రైల్వేస్టేషన్‌లో అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు కమల్ వద్ద నుంచి రూ. 5 కోట్ల విలువ చేసే బంగారం, నగదు స్వాధీనం చేసుకున్నారు. నార్త్ జోన్ పోలీసులు బుధవారం సాయంత్రం మీడియా ఎదుట నిందితులను ప్రవేశపెట్టనున్నారు. సీసీ కెమెరాలతో పాటు సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా పోలీసులు నిందితులను గుర్తించారు.

పూర్తి వివరాలు...

కోటీశ్వరులైన ఆ కుటుంబంపై ఎప్పుడో కన్ను వేశాడు ఓ నేపాలీ వాచ్‌మన్‌! వాళ్లు ఇంటికి తాళాలు వేసి వెళ్లడంతో అదే అదనుగా ఇతర నగరాల్లో ఉన్న నేపాలీ దొంగలను పిలిచాడు. ఆ ముఠా రూ.5 కోట్ల సొత్తు దోచుకుని పరారైంది. ఈ భారీ చోరీ సికింద్రాబాద్‌ సింధి కాలనీలో జరిగింది. దొంగలు రూ.49 లక్షల నగదుతో పాటు వజ్రాలు, బంగారం, వెండి కొల్లగొట్టారు. రామ్‌గోపాల్‌పేట ఇన్‌స్పెక్టర్‌ లింగేశ్వర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. సింధి కాలనీ పీజీ రోడ్డు డిమ్మీ పాన్‌షాప్ ప్రాంతంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఒక ఫ్లోర్‌ అంతా రాహుల్‌ గోయల్‌, ఆయన ముగ్గురు సోదరుల కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. వారిది ఐరన్‌ వ్యాపారం. వారి అపార్ట్‌మెంట్‌లో నేపాల్‌కు చెందిన కమల్‌ ఐదేళ్లుగా వాచ్‌మన్‌గా పనిచేస్తున్నాడు.

రాహుల్‌ కుటుంబం బోనాల పండుగను జరుపుకోవడానికి ఈ నెల 9న నగర శివారులోని ఫామ్‌హౌస్‌కు వెళ్లింది. సోమవారం సాయంత్రం తిరిగి వచ్చింది. ఇంటి మెయిన్‌ డోర్‌తో పాటు ఫ్లోర్‌లో ఉన్న 8 గదుల తాళాలు పగలగొట్టి ఉండడంతో చోరీ జరిగినట్టు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాహుల్‌ కుటుంబంతో అనుబంధం పెంచుకున్న వాచ్‌మెన్‌ కమల్‌ వారి ఇంట్లో కోట్ల విలువైన బంగారం, వెండి, వజ్రాభరణాలు ఉన్నట్లు తెలుసుకున్నాడు. బోనాల పండుగకు వెళతారని ముందే తెలుసుకున్న కమల్‌ ఇతర నగరాల్లో ఉన్న నేపాల్‌కు చెందిన దొంగలకు సమాచారం ఇచ్చాడు. మొత్తం ఆరుగురు దొంగలు చోరీలో పాల్గొన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. సీపీటీవీ ఫుటేజీలు పరిశీలించగా దొంగలు ఆటోలో వచ్చి.. చోరీ చేసి ఆటోలో వెళ్లినట్లు గుర్తించారు. ఆ తర్వాత ముందే బుక్‌ చేసుకున్న బస్సులో పారిపోయినట్లు తెలిసింది. దీంతో నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీస్ ప్రత్యేక బృందాలు ముంబైలో వారిని పట్టుకున్నారు.

Updated Date - 2023-07-12T14:46:51+05:30 IST