Teachers Transfers; టీచర్ల బదిలీలపై త్వరగా విచారణ చేపట్టండి

ABN , First Publish Date - 2023-08-15T02:43:38+05:30 IST

ఉపాధ్యాయుల బదిలీల నిబంధనలను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌లపై త్వరగా విచారణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు విజ్ఞప్తి చేసింది. స్టే ఉండటం వల్ల అన్ని విభాగాలకు సంబంధించిన దాదాపు 60 వేలమంది ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు నిలిచిపోయాయని పేర్కొంది.

 Teachers Transfers; టీచర్ల బదిలీలపై త్వరగా విచారణ చేపట్టండి

హైకోర్టును కోరిన రాష్ట్ర ప్రభుత్వం

హైదరాబాద్‌, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయుల బదిలీల నిబంధనలను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌లపై త్వరగా విచారణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు విజ్ఞప్తి చేసింది. స్టే ఉండటం వల్ల అన్ని విభాగాలకు సంబంధించిన దాదాపు 60 వేలమంది ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు నిలిచిపోయాయని పేర్కొంది. ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి ఈ ఏడాది జనవరిలో ప్రభుత్వం జీవో నెంబర్‌ 5 జారీచేసింది. ఈ రూల్స్‌ చట్టవ్యతిరేకమని పేర్కొంటూ హైకోర్టులో పలు పిటిషన్‌లు దాఖలయ్యాయి. దాంతో ఫిబ్రవరిలో స్టే విధించింది. ఈ పిటిషన్‌లు సోమవారం మరోసారి చీఫ్‌ జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ టి. వినోద్‌కుమార్‌ ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చాయి. పిటిషనర్‌లు సమయం కోరుతుండటంతో తదుపరి విచారణను ధర్మాసనం ఈనెల 23కు వాయిదా వేసింది.

Updated Date - 2023-08-15T03:11:05+05:30 IST