Minors Driving: చదువు కోసం న్యూజిల్యాండ్ నుంచి వచ్చి... చివరకు

ABN , First Publish Date - 2023-01-31T14:07:17+05:30 IST

నగరంలోని హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధి ఇంద్రప్రస్థ కాలనీలో విషాదం చోటు చేసుకుంది.

Minors Driving: చదువు కోసం న్యూజిల్యాండ్ నుంచి వచ్చి... చివరకు

హైదరాబాద్: నగరంలోని హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధి ఇంద్రప్రస్థ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. మైనర్‌ల నిర్లక్ష్యపు డ్రైవింగ్‌ (Careless driving by minors) కారణంగా పదమూడేళ్ల బాలుడి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఆదివారం సాయంత్రం బాలుడు సాయి శ్రీశాంత్ రెడ్డి సైక్లింగ్ చేస్తుండగా మైనర్‌‌ల బైక్ వేగంగా వచ్చి ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన బాలుడిని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. న్యూజీలాండ్‌‌ (New Zealand)లో పుట్టి, పెరిగిన బాలుడు...అక్కడే చదువుకుంటున్నాడు. తల్లిదండ్రులు సురేందర్ రెడ్డి, స్వర్ణలక్ష్మిలు ఇద్దరూ న్యూజిలాండ్ సిటిజన్సే. బాలుడి మరణవార్త ఇంకా తల్లికి తెలియలేదు. న్యూజిలాండ్ నుంచి తల్లి స్వర్ణలక్ష్మి ఈరోజు రాత్రికి ఇంటికి రానున్నారు. ఈ ఘటనపై హయత్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసి... మైనర్‌ల నిర్లక్ష్యపు డ్రైవింగ్‌పై దర్యాప్తు చేపట్టారు.

తండ్రి ఆవేదన...

కొడుకు మరణంతో తండ్రి సురేందర్ రెడ్డి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాడు. ‘‘నా కుమారుడు అంటే నాకు ప్రాణం. న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలో చదువుతున్న నా కొడుకును ఈ దేశంపై ఉన్న అభిమానంతో ఇక్కడికి తీసుకొచ్చాను. ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలు పిల్లలకు తెలియాలని ఇక్కడ చదివేందుకు తీసుకొచ్చాను. చివరకు నా కొడుకు మైనర్‌ల డ్రైవింగ్‌కు బలయ్యాడు. డిసిప్లిన్‌గా వుండే దేశం నుంచి నేనే నా కొడుకును డిసిప్లిన్‌లేని చోటకు తెచ్చినట్టు అయింది’’ అంటూ తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు. చదవుకునేందుకు ఇక్కడకు వచ్చిన బాలుడు ప్రాణాలు కోల్పోవడం అందరినీ కలిచివేస్తోంది.

Updated Date - 2023-01-31T14:11:19+05:30 IST