Schools Open: తెలంగాణ వ్యాప్తంగా పాఠశాలలు ప్రారంభం
ABN , First Publish Date - 2023-06-12T09:25:33+05:30 IST
తెలంగాణ వ్యాప్తంగా పాఠశాలలు పున:ప్రారంభమయ్యాయి. వేసవి సెలవులు ముగియడంతో రాష్ట్రంలో పాఠశాలలు తిరిగి మొదలయ్యాయి.
హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా పాఠశాలలు పున:ప్రారంభమయ్యాయి. వేసవి సెలవులు ముగియడంతో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వం, ప్రైవేటు పాఠశాలలు తిరిగి మొదలయ్యాయి. దాదాపు 55 లక్షల మంది విద్యార్థులు బడిబాట పట్టారు. ఈ ఏడాది నుంచి రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులందరికీ నోట్‌బుక్స్ పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. యూనిఫాం, పాఠ్య పుస్తకాలతో పాటు నోట్‌బుక్స్ పంపిణీ జరుగనుంది. 1 నుంచి 5 తరగతులకు వర్క్ బుక్స్, 6 నుంచి 10 విద్యార్థులకు నోట్ బుక్స్‌ను ఇవ్వనున్నారు. మధ్యాహ్నం భోజనంలో ఒకరోజు కిచిడి, మరో రోజు వెజిటేబుల్ బిర్యానిని విద్యార్థులకు ఇవ్వనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో గత ఏడాది ప్రారంభించిన ఇంగ్లీషు మీడియం కొనసాగనుంది. గత ఏడాది 1 నుంచి 8వ తరగతి వరకు అమలు చేసిన ఇంగ్లీషు మీడియాన్ని ఈ ఏడాది 9వ తరగతి వరకు పొడిగించారు. వచ్చే ఏడాది 10వ తరగతి వరకు అమలు చేయనున్నారు.