SCR Special Trains: వేసవి దృష్ట్యా ఆ నగరాల మధ్య ప్రత్యేక రైళ్లు..కొన్ని రైళ్లకు అదనపు బోగీలు
ABN , First Publish Date - 2023-04-19T11:55:39+05:30 IST
వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని సికింద్రాబాద్-దనపూర్ మార్గంలో ప్రత్యేక రైళ్లు ..
సికింద్రాబాద్: వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని సికింద్రాబాద్-దనపూర్ మార్గంలో ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్టు దక్షిణమధ్యరైల్వే అధికారులు తెలిపారు. అంతేకాకుండా సికింద్రాబాద్ నుంచి మరికొన్న ప్రాంతాలకు నడుపుతున్న రైళ్లకు ప్రత్యేకంగా అదనపు బోగీలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
వేసవి దృష్ట్యా పలు రైళ్లలో అదనపు బోగీలను పెంచుతున్నట్లు దక్షిణమధ్య రైల్వే అధికారులు తెలిపారు. అదనపు బోగీలు పెంచిన రైళ్ల వివరాలు :
సికింద్రాబాద్- దనపూర్ స్పెషల్ (రైల్ నెంబర్: 03226) సికింద్రాబాద్ నుంచి మే 7వ తేదీ నుంచి జూలై 2వ తేదీ వరకు ప్రతి ఆదివారం ఉదయం 10గంటలకు బయల్దేరి, సోమవారం రాత్రి 7గంటలకు దనపూర్ చేరుతుంది.
దనపూర్- సికింద్రాబాద్ స్పెషల్ (రైల్ నెంబర్: 03225) దనపూర్ నుంచి మే 4వ తేదీ నుంచి జూన్ 29వ తేదీ వరకు ప్రతి గురువారం రాత్రి 8.50గంటలకు బయల్దేరి, శనివారం ఉదయం 4.40గంటలకు సికింద్రాబాద్ చేరుతుంది.
కొన్ని రైళ్లకు అదనపు బోగీలు
మచిలీపట్నం-యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ (రైల్ నెంబర్: 17211)కు ఏప్రిల్ 24వ తేదీ నుంచి 1 సెకండ్ ఏసీ, 2 థర్డ్ ఏసీ బోగీలు అదనంగా జత చేయనున్నారు.
యశ్వంత్‌పూర్-మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్ (రైల్ నెంబర్: 17212)కు ఏప్రిల్ 25వ తేదీ నుంచి 1 సెకండ్ ఏసీ, 2 థర్డ్ ఏసీ బోగీలు అదనంగా జత చేయనున్నారు.
మచిలీపట్నం-సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ (రైల్ నెంబర్: 07185)కు ఏప్రిల్ 30వ తేదీ నుంచి 1 సెకండ్ ఏసీ, 2 థర్డ్ ఏసీ బోగీలు అదనంగా జత చేయనున్నారు.
సికింద్రాబాద్-మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్ (రైల్ నెంబర్: 07186)కు ఏప్రిల్ 30వ తేదీ నుంచి 1 సెకండ్ ఏసీ, 2 థర్డ్ ఏసీ బోగీలు అదనంగా జత చేయనున్నారు.