Home » Special trains
సంక్రాంతి పండుగ(Sankranti festival)ను పురస్కరించుకుని జనవరి నెలలో చర్లపల్లి రైల్వే టెర్మినల్ నుంచి పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణమధ్య రైల్వే అధికారులు తెలిపారు. చర్లపల్లి నుంచి బయలు దేరే, తిరిగి వచ్చే రైళ్ల వివరాలను వెల్లడించారు.
పొంగల్(Pongal) సందర్భంగా ప్రయాణికుల సౌకర్యార్ధం ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణ రైల్వే(Southern Railway) ఒక ప్రకటనలో తెలిపింది. - నెం.06569 బెంగళూరు-తూత్తుకుడి ప్రత్యేక రైలు ఈ నెల 10వ తేది బెంగళూరులో రాత్రి 10 గంటలకు బయల్దేరి మరుసటిరోజు ఉదయం 11 గంటలకు తూత్తుకుడి చేరుకుంటుంది.
కాచిగూడ, చర్లపల్లి నుంచి శ్రీకాకుళం వరకు నడపనున్న ప్రత్యేక రైళ్లల్లో ఇంకా వందల సంఖ్యలో బెర్తులు ఖాళీగానే ఉన్నాయి. పండుగ రోజుల్లో ఊరు వెళ్లాలనుకునేవారికి నిజంగా ఇది పండుగలాంటి వార్తగానే చెప్పుకోవాలి. జనవరి 14, 15 తేదీల్లో మీరు హైదరాబాద్ నుంచి విశాఖపట్టణం వైపు వెళ్లాలంటే ఎలాంటి చింత అవసరం లేదు. జనరల్ కేటగిరీలో వందల సీట్లు ఖాళీగా ఉన్నాయి.
ప్రయాణికుల రద్దీ నియంత్రణకు శబరిమల(Shabarimala)కు గుంతకల్లు డివిజన్(Guntakal Division) మీదుగా ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు బుధవారం తెలిపారు. కాచిగూడ-కొట్టాయం-కాచిగూడ (వయా గుత్తి) ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.
ప్రయాణికుల రద్దీ నియంత్రణకు రైల్వే శాఖ అనంతపురం మీదుగా ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు అధికారులు తెలిపారు. బెంగళూరు-బరౌనీ ప్రత్యేక రైలు (నం. 06563)ను ఈ నెల 12, 19 తేదీల్లో బెంగళూరులో రాత్రి 9-15 గంటలకు బయలుదేరి రెండు రోజుల తర్వాత 14, 21 తేదీలలో రాత్రి 8 గంటలకు బరౌనీకి చేరుకుంటుందన్నారు.
దీపావళి, చాత్ పూజ వేళ ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దేశంలోని వివిధ ప్రాంతాలకు పలు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు భారతీయ రైల్వే మంగళవారం ప్రకటించింది. ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్ తదితర రాష్ట్రాల నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లిన ప్రజలు మళ్లీ స్వస్థలాలకు చేరేందుకు ఈ ప్రత్యేక రైళ్లు ఉపయోగపడతాయని తెలిపింది.
రానున్న దసరా, దీపావళి, ఛాట్ ఫెస్టివల్స్(Dussehra, Diwali, Chat Festivals) సందర్భంగా ఆయా ప్రాంతాలకు వెళ్లి వచ్చేందుకు వేర్వేరు ప్రాంతాల నుంచి 48 ప్రత్యేక రైళ్లను నడుపడానికి ఏర్పాట్లు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.
విజయదశమి, దీపావళి పండుగల సందర్భంగా చెన్నై ఎగ్మూర్-విశాఖపట్టణం, విశాఖపట్టణం-కొల్లం మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది.
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్-కటక్(Secunderabad-Cuttack) మార్గంలో ఎనిమిది ప్రత్యేకరైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) ప్రకటించింది.
వేలాంకన్ని ఉత్సవాల సందర్భంగా తెలంగాణ రాష్ట్రం సికింద్రాబాద్(Secunderabad) నుంచి వేలాంకన్నికి ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణ రైల్వే(Southern Railway) ఒక ప్రకటనలో తెలిపింది.