TSPSC : సిట్ దర్యాప్తులో వెలుగులోకి సంచలన విషయాలు.. లీకైన 15 క్వశ్చన్ పేపర్లు ఏంటంటే..
ABN , First Publish Date - 2023-03-31T10:55:38+05:30 IST
టీఎస్‌పీఎస్‌సీకి సంబంధించిన పేపర్ లీకేజీ కేసులో సిట్ దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మొత్తం 6 రకాల పరీక్షలకు చెందిన 15 క్వశ్చన్ పేపర్లు లీక్ అయినట్లు సిట్ గుర్తించింది.
హైదరాబాద్ : టీఎస్‌పీఎస్‌సీకి సంబంధించిన పేపర్ లీకేజీ కేసులో సిట్ దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మొత్తం 6 రకాల పరీక్షలకు చెందిన 15 క్వశ్చన్ పేపర్లు లీక్ అయినట్లు సిట్ గుర్తించింది. గ్రూప్1 పేపర్ 5 గురికి... ఏఈ పేపర్ ఎక్కువ మందికి లీక్ అయ్యింది. మిగతా పేపర్లు పెన్ డ్రైవ్‌కే పరిమితమయ్యాయి. గ్రూప్1 మెయిన్స్ పేపర్ కూడా లీక్ చేసేందుకు.. రాజశేఖర్, ప్రవీణ్ యత్నించారు. ప్రవీణ్, సురేష్, రమేష్, షమీమ్, న్యూజిలాండ్‌లో ఉండే ప్రశాంత్ వద్ద మాత్రమే గ్రూప్1 పేపర్ ఉన్నట్టు గుర్తించారు. ప్రవీణ్, రాజశేఖర్ వద్ద లభించిన పెన్ డ్రైవ్‌లో.. గ్రూప్1, ఏఈ, ఏఈఈ, టౌన్ ప్లానింగ్, జేఎల్, డిస్ట్రిక్ట్ అకౌంట్స్ ఆఫీసర్ క్వశ్చన్ పేపర్లు లభ్యమయ్యాయి. ఈ పేపర్లను అమ్మేందుకు యత్నిస్తున్న క్రమంలోనే స్కాం బయటపడింది. షమీమ్ ఇంట్లో గ్రూప్1 మాస్టర్ క్వశ్చన్ పేపర్ కాపీలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
లీక్ అయిన టీఎస్‌పీఎస్‌సీ15 క్వశ్చన్ పేపర్లు..
గ్రూప్1 జనరల్ స్టడీస్
AEE సివిల్ ఇంజనీరింగ్
AEE ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్
AEE మెకానికల్ ఇంజనీరింగ్
DAO జనరల్ స్టడీస్
DAO మ్యాథమెటిక్స్
జనరల్ స్టడీస్ డిప్లమా AE
ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిప్లమా AE
ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిప్లమా AE పేపర్ -2
సివిల్ ఇంజనీరింగ్ డిప్లమా AE పేపర్ -2
TPBO ఒకేషనల్ జనరల్ స్టడీస్ పేపర్ -1
TPBO ఒకేషనల్ జనరల్ స్టడీస్ పేపర్ -2
జూనియర్ లెక్చరర్స్