Hyderabad: కోదండరాంను కలిసిన వైఎస్ షర్మిల
ABN , First Publish Date - 2023-04-04T12:55:36+05:30 IST
వైఎస్ఆర్‌టీపీ (YSRTP) అధ్యక్షురాలు షర్మిల (Sharmila).. టీజేఎస్ అధ్యక్షుడు (TJC Chief) కోదండరాం (Kodandaram)ను నాంపల్లిలోని టీజేఎస్ పార్టీ కార్యాలయంలో (TJS Party Office) కలిసారు.
హైదరాబాద్: వైఎస్ఆర్‌టీపీ (YSRTP) అధ్యక్షురాలు షర్మిల (Sharmila).. టీజేఎస్ అధ్యక్షుడు (TJC Chief) కోదండరాం (Kodandaram)ను నాంపల్లిలోని టీజేఎస్ పార్టీ కార్యాలయంలో (TJS Party Office) కలిసారు. ఈ సందర్భంగా టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ (TSPSC Paper Leak), నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు కలసి పోరాటంపై చర్చలు జరిపినట్లు సమాచారం. ఈ సందర్బంగా షర్మిల మాట్లాడుతూ.. నిరుద్యోగ సమస్య యువతను పట్టి పీడిస్తోందన్నారు. అందరం కలిసికట్టుగా పనిచేస్తే మంచిదని తన అభిప్రాయమన్నారు. టి సేవ్ ఫోరం (T save forum) పేరుతో అందరం కలిసి పోరాడుదామని పిలుపిచ్చారు. నిరుద్యోగులకు భరోసా కోసమే టి సేవ్ ఫోరమ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. షర్మిల వ్యాఖ్యలపై కోదండరాం సానుకూలంగా స్పందించారు. పార్టీలో చర్చించి నిర్ణయం చెబుతానన్నారు.
కోదండరాం మాట్లాడుతూ.. నిరుద్యోగుల తరపున కలిసికట్టుగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎవరితో కలిసి పోవాలనేది తమ రాష్ట్ర కమిటీ నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఎవరితో కలిసి ఎలా పోరాటంలో ముందుకు వెళ్ళాలనేది రాష్ట్ర కమిటీలో చర్చించుకుంటామన్నారు. రాష్ట్రంలో పేపర్ల లీకేజీ విద్యార్థుల్లో గందరగోళం నెలకుంటోందన్నారు.
విద్యార్థుల్లో టెన్షన్ మొదలయ్యిందని.. ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో అడుకుంటుందని కోదండరాం మండిపడ్డారు. 10వ తరగతికి సంబంధించి నిన్న ఒకటి, మంగళవారం మరొకటి పేపర్ లీక్ కావడం ప్రభుత్వ నిర్లక్షమేనని దుయ్యబట్టారు. ఇవాళ సాయంత్రం అఖిలపక్ష ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తున్నామని.. భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తామని కోదండరాం స్పష్టం చేశారు.