Sirisha Case: శిరీష మృతి కేసు.. పోలీసుల అదుపులో ఇద్దరు యువకులు..

ABN , First Publish Date - 2023-06-12T16:40:39+05:30 IST

వికారాబాద్ జిల్లా: పరిగి మండలం కాడ్లాపూర్‌లో యువతి శిరీష అనుమానాస్పద మృతిపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. యువతి సెల్ ఫోన్ కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు మమ్మరం చేశారు.

Sirisha Case: శిరీష మృతి కేసు.. పోలీసుల అదుపులో ఇద్దరు యువకులు..

వికారాబాద్ జిల్లా: పరిగి మండలం కాడ్లాపూర్‌లో యువతి శిరీష (Sirisha) అనుమానాస్పద మృతిపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. యువతి సెల్ ఫోన్ కాల్ డేటా (Call Data) ఆధారంగా దర్యాప్తు మమ్మరం చేశారు. గ్రామానికి చెందిన ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. శిరీష అంత్యక్రియల అనంతరం ఆమె తండ్రి జంగయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కాల్ డేటా ఆధారంగా శిరీష మృతి చెందిన మరుసటిరోజు యువతి ఫోన్ నుంచి ఓ వ్యక్తికి కాల్ వెళ్ళినట్టు పోలీసులు గుర్తించారు. రాత్రి గొడవ జరిగినప్పుడు శిరీష వద్ద నుంచి ఫోన్ లాగేసుకున్నానని పోలీసుల విచారణలో బావ అనిల్ చెప్పాడు. ఉదయం ఫోన్ నుంచి కాల్ వెళ్ళినప్పటికీ తనకు ఫోన్ పాస్వర్డ్ (Password) తెలియదంటూ అనిల్ బుకాయించే ప్రయత్నం చేశాడు. డాటా డిలీట్ కాకుండా సిడిఆర్ (CDR) ద్వారా కాల్ హిస్టరీ (Call History) సేకరించే ప్రయత్నం. కొంత సమయం గడిస్తే కేసు చిక్కుముడి వీడే అవకాశముంది.

కాగా వికారాబాద్ జిల్లాలోని పరిగి కాడ్లాపూర్‌లో యువతి శిరీష అనుమానాస్పద మృతి కేసులో పోలీసుల విచారణపై అన్న శ్రీకాంత్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హత్య.. ఆత్మహత్య అంటూ పోలీసులు తికమక చేస్తున్నారంటూ ఆవేదన చెందారు. ఆ చిన్న కుంటలో మోకాలి లోతు నీటిలో ఎలా ఆత్మహత్య చేసుకుంటారో చెప్పాలని యువతి అన్న శ్రీకాంత్ ప్రశ్నించారు. ఆ కుంటలో ఎలాంటి రాళ్ళు లేవన్నారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు సమగ్ర విచారణ చేయాలని..తమ కుంటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ‘‘మా నాన్న తప్పు చేసినా... బావ తప్పు చేసిన శిక్షించాలి’’ అని అన్నారు. అసలు నిజం నిగ్గు తెల్చాలని డిమాండ్ చేశారు. మరోవైపు పోలీసుల తీరుపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు సరిగ్గా విచారణ చేయడం లేదని అన్నారు. శిరీషది ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. యువతి మృతికి తండ్రి, బావ ఇద్దరు కారణమని.. పోలీసులు సరిగ్గా విచారణ చేయాలని డిమాండ్ చేశారు.

Updated Date - 2023-06-12T16:40:39+05:30 IST