Telangana Students: మణిపూర్ నుంచి హైదరబాద్‌కు బయలుదేరిన ప్రత్యేక విమానం..
ABN , First Publish Date - 2023-05-08T10:48:13+05:30 IST
న్యూఢిల్లీ: మణిపూర్ (Manipur)లో చిక్కుకున్న తెలంగాణ విద్యార్థులను (Telangana Students) తీసుకువచ్చేందుకు తెలంగాణ భవన్ అధికారులు ఏర్పాట్లు చేశారు.
న్యూఢిల్లీ: మణిపూర్ (Manipur)లో చిక్కుకున్న తెలంగాణ విద్యార్థులను (Telangana Students) తీసుకువచ్చేందుకు తెలంగాణ భవన్ (Telangana Bhavan) అధికారులు ఏర్పాట్లు చేశారు. దీంతో సోమవారం ఉదయం మణిపూర్ నుంచి హైదరబాద్‌కు ప్రత్యేక విమానం (Special Flight) బయలుదేరింది. విమానంలో 72 మంది విద్యార్థులు ఉన్నారు. 12 గంటలకు హైదరబాద్‌కు చేరుకోనుంది. అలాగే మిగిలినవారిని తీసుకువచ్చేందుకు 11 గంటల తర్వాత మణిపూర్ నుంచి హైదరబాద్‌కు మరో విమానం బయలు దేరనుంది. శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న అనంతరం అక్కడ నుంచి వారి స్వగ్రామాలకు అధికారులు తరలించనున్నారు.
మణిపూర్ నుంచి మొత్తం 103 మంది విద్యార్థులను తరలించేందుకు తెలంగాణ భవన్ అధికారులు ఏర్పాటు చేశారు. తొలి దఫాలో 72 మంది విద్యార్థులు నేరుగా హైదరాబాద్ చేరుకోనున్నట్లు తెలంగాణ భవన్ ప్రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ వెల్లడించించారు. మిగిలిన వారిని కోల్‌కతా మీదుగా హైదరాబాద్‌కు తరలించనున్నట్లు తెలిపారు. విద్యార్థుల సౌకర్యార్థం తెలంగాణ భవన్‌కు చెందిన ఇద్దరు అధికారులను ప్రత్యేకంగా కోల్‌కతాకు పంపినట్లు ఉన్నతాధికారులు పేర్కొన్నారు. కోల్‌కతా నుంచి హైదరాబాదుకు వెళ్లే విద్యార్థులు ఇప్పటికే టికెట్లు కూడా బుక్ చేసినట్లు అధికారులు వెల్లడించారు.