Stephen Ravindra : డ్రగ్స్ ముఠాకు కింగ్ పిన్‌ అతడే..

ABN , First Publish Date - 2023-05-06T11:20:35+05:30 IST

హైదరాబాద్ నగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం రేపింది. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో భారీగా డ్రగ్స్ పట్టుబడిన విషయం తెలిసిందే.

Stephen Ravindra : డ్రగ్స్ ముఠాకు కింగ్ పిన్‌ అతడే..

హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం రేపింది. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో భారీగా డ్రగ్స్ పట్టుబడిన విషయం తెలిసిందే. డ్రగ్స్ ఫెడ్లింగ్ చేస్తున్న నలుగురితో కలిసిన గ్యాంగ్‌ను అరెస్ట్ చేశామని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. 303 గ్రాముల కొకైన్ సీజ్ చేశామని తెలిపారు. రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశామన్నారు. ఈ డ్రగ్స్ ముఠాకు కింగ్ పిన్‌గా చింతా రాకేష్ అనే వ్యక్తి వ్యవహరిస్తున్నాడని వెల్లడించారు. చింతా రాకేష్ లోకల్‌గా ఇద్దరు పెడ్లర్‌లను హైర్ చేసుకున్నాడని తెలిపారు.

ఇంకా సీపీ స్టీఫెన్ రవీంద్ర మాట్లాడుతూ.. ‘‘చింతా రాకేష్ గోవాకు వెళ్ళినపుడు నైజీరియన్స్ గాబ్రియేల్, విక్టర్‌తో పరిచయం ఏర్పడింది.. గోవాలో ఓసారి కొకైన్ తీసుకున్నాడు... క్రమంగా డ్రగ్స్‌కు రాకేష్ అడిక్ట్ అయ్యాడు. ఏ1 రాకేష్ రోషన్ డ్రై ఫ్రూట్స్ వ్యాపారం చేసి నష్టపోయాడు. రాకేష్ గాబరియాల దగ్గర కొకైన్ గ్రాముకు 7వేల రూపాయలకు కొని.. హైదరాబాదులో గ్రాముకు18 వేల చొప్పున విక్రయిస్తున్నాడన్నారు. బాచుపల్లికి చెందిన శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తిని సహ పెడ్లర్‌గా నియమించుకున్నాడు. శ్రీనివాస్ రెడ్డి కూడా వ్యాపారంలో నష్టపోయాడు. రాకేష్ శ్రీనివాస్ రెడ్డిని గోవాకు పంపి అతని ద్వారా నగరానికి తెప్పించేవాడు. శ్రీనివాస్ విక్రయించడంతోపాటు కమిషన్‌ను రాకేష్‌కు ఇచ్చేవాడు. సూర్య ప్రకాష్ అనే మరో వ్యక్తిని కూడా రాకేష్ సహ పెడ్లర్‌గా నియమించుకున్నాడు.

రాకేష్ సూచన మేరకు సూర్య ప్రకాష్ 23 గ్రాముల కొకైన్ తీసుకువచ్చాడు. అందులో ఆరు గ్రాములు శ్రీనివాస్ రెడ్డికి ఆరు గ్రాములు రాకేష్ కు ఇచ్చాడు. హైదరాబాద్‌లో డ్రగ్స్‌కు డిమాండ్ ఉందని నగరానికి రావాలని విక్టర్‌కు సూర్యప్రకాష్ సూచించాడు. ఇందులో భాగంగా 100 గ్రాముల కొకైన్‌తో విక్టర్ నగరానికి చేరుకున్నాడు. కొకైన్ విక్రయిస్తుండగా నానక్‌రాం గూడాలో సూర్య ప్రకాష్, విక్టర్‌లను అదుపులోకి తీసుకున్నాం. సూర్య ప్రకాష్‌ను విచారించగా శ్రీనివాస్ రెడ్డి చింతా రాకేష్‌ల పాత్ర బయటపడింది. వినియోగదారుల లిస్ట్ ఉంది.. వారిని గుర్తించి నోటీస్ ఇస్తామన్నారు. గాబ్రియల్ నైజీరియాకు వెళ్లిపోవడంతో విక్టర్ మాత్రమే పట్టుబడ్డాడు.

చాలాకాలంగా ఈ గ్యాంగ్ డ్రగ్స్ విక్రయిస్తోంది. వాట్సాప్ ద్వారా డ్రగ్స్ క్రయవిక్రయాలను కొనసాగించారు వాట్సాప్ చాట్ కూడా సంపాదించాం. విక్టర్ దగ్గర డ్రగ్స్ క్యాప్సూల్స్ దొరికాయి. వాస్తవానికి ఈ క్యాప్సూల్స్‌ను కడుపులో పెట్టుకొని అక్రమంగా తరలిస్తూ ఉంటారు. నిందితుల వద్ద సేకరించిన సమాచారం ప్రకారం డ్రగ్స్ వినియోగదారులు బిజినెస్ మాన్స్ కూడా ఉన్నారు. నిడిదలు పార్టీలకు కూడా ఒక అయిన సరఫరా చేసినట్టు తేలింది. నిందితులను విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయి’’ అని పేర్కొన్నారు.

Updated Date - 2023-05-06T11:20:35+05:30 IST