Talasani Srinivas Yadav : భవిష్యవాణిలో అలా చెప్పడం ఆనందంగా ఉంది
ABN , First Publish Date - 2023-07-10T10:22:41+05:30 IST
నేడు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో కీలక ఘట్టం చోటు చేసుకుంది. యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎదురు చూసే.. రంగం కార్యక్రమం నేడు జరిగింది. రంగం కార్యక్రమం చూసి భవిష్యవాణి వినటానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.
హైదరాబాద్ : నేడు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో కీలక ఘట్టం చోటు చేసుకుంది. యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎదురు చూసే.. రంగం కార్యక్రమం నేడు జరిగింది. రంగం కార్యక్రమం చూసి భవిష్యవాణి వినటానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. ‘‘రంగం కార్యక్రమం భవిష్యవాణి పూర్తి అయ్యింది. మరికాసేపట్లో పోతరాజుల ఊరేగింపు, ఘటోత్సవం ఘనంగా జరుగుతోంది. లక్షల మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. రాత్రి అంతా దర్శనాలు జరిగాయి. సీఎం, మంత్రులు, వివిధ పార్టీల పెద్దలు దర్శనం చేసుకున్నారు. ఒకప్పుడు రాజకీయ నేతలు దర్శనం తరువాత వర్షాలు పడాలి అని కోరుకునే వారు. 2014 తరువాత రైతాంగం అంతా సంతోషంగా ఉన్నారు. అమ్మవారు భవిష్యవాణిలో బోనాలు కార్యక్రమం బాగా జరిగింది అని చెప్పడం సంతోషం. తెలంగాణ రాష్ట్ర పండుగ అయిన బోనాలకు అన్ని డిపార్ట్మెంట్‌లు సహకరించాయి. ఎటువంటి ఆటంకం లేకుండా ఏర్పాట్లు జరిగాయి. సాయంత్రం 7 గంటలకు మళ్ళీ ఫలహారం బండ్ల ఊరేగింపు జరుగుతుంది.