Tammineni Veerabhadram.. మహిళ బిల్లు మంచిదే కానీ..: తమ్మినేని వీరభద్రం
ABN , First Publish Date - 2023-09-21T12:57:08+05:30 IST
హైదరాబాద్: మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ కేంద్రం తీసుకువచ్చిన మహిళ బిల్లు మంచిదే కానీ.. బిల్లులో పెట్టిన ప్రొవిజన్స్ కొంత ఇబ్బంది కలిగించిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అభిప్రాయం వ్యక్తం చేశారు.
హైదరాబాద్: మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ కేంద్రం తీసుకువచ్చిన మహిళ బిల్లు మంచిదే కానీ.. బిల్లులో పెట్టిన ప్రొవిజన్స్ కొంత ఇబ్బంది కలిగించిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి (CPM State Secretary) తమ్మినేని వీరభద్రం (Tammineni Veerabhadram) అభిప్రాయం వ్యక్తం చేశారు. గురువారం హైదరాబాద్ సీపీఎం కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడుతూ బీజేపీ (BJP)కి అభిమానముంటే మహిళా రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలన్నారు. అక్టోబర్ 1న కమ్యూనిస్టులు పోటీచేసే అసెంబ్లీ స్థానాలను ప్రకటిస్తామని స్పష్టం చేశారు.
ఎంఐఎం (MIM) థర్డ్ ఫ్రంట్ (Third Front) ఆలోచన అంత బీజేపీ కోసమేనని, బీజేపీ కోసం ఎంఐఎం చాలా రాష్ట్రాల్లో పోటీచేసి ఓట్లు చీల్చిందని తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. బీజేపీకు సహకరించేలా బీఆర్ఎస్ అధినేత (BRS Chief), సీఎం కెసీఆర్ (CM KCR) ఆలోచన ఉందని.. ఇండియా కూటమిని కాదని పరోక్షంగా బీజేపీకి కేసీఆర్ సపోర్ట్ చేస్తున్నారని విమర్శించారు. బీజేపీకీ వ్యతిరేకంగా కమ్యూనిస్టులుగా పోరాటం చేస్తామని తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు.