TS Assembly: మరికాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
ABN , Publish Date - Dec 14 , 2023 | 09:37 AM
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు గురువారం ఉదయం 10:30 గంటలకు ప్రారంభమవుతాయి. సభ ప్రారంభం కాగానే స్పీకర్ ఎన్నిక విషయాన్ని ప్రోటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ తెలపనున్నారు.
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు గురువారం ఉదయం 10:30 గంటలకు ప్రారంభమవుతాయి. సభ ప్రారంభం కాగానే స్పీకర్ ఎన్నిక విషయాన్ని ప్రోటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ తెలపనున్నారు. కాగా అసెంబ్లీ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్పీకర్‌ను గౌరవ పూర్వకంగా ఆయన కుర్చీలో సీఎం, మంత్రులు అధికార, ప్రతిపక్ష సభ్యులు కూర్చోపెట్టనున్నారు. ఈ సందర్భంగా స్పీకర్‌కు ధన్యవాదాల తీర్మానంపై సభ్యులు మాట్లాడనున్నారు.
స్పీకర్ చైర్ ఔన్నత్యం, స్పీకర్ గుణగణాలు, ఆయనతో ఉన్న పరిచయాలను సభ్యులు ప్రస్తావించనున్నారు. గడ్డం ప్రసాద్ కమార్‌కు 111 మంది ఎమ్మెల్యేలు మద్దతు తెలిపారు. 63 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ మిత్రపక్షంగా ఉన్న సీపీఐ ఎమ్మెల్యే మద్దతు తెలిపారు. అలాగే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 39 మంది మద్దతు తెలిపారు. గడ్డం ప్రసాద్ నామినేషన్ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఏడుగురు ఏంఐఏం ఎమ్మేల్యేలు హాజరయ్యారు. కాగా స్పీకర్ ఎన్నికకు బీజేపీ ఎమ్మేల్యేలు దూరంగా ఉన్నారు. అసెంబ్లీ సమావేశం ముగిసిన అనంతరం బిజినెస్ అడ్వైజర్ కమిటీ సమావేశం అవుతుంది. ఈ భేటీలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే పని దినాలను బీఏసీ ఖరారు చేయనుంది. దాదాపు పది రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది.