T.Highcourt: భద్రాద్రిలో వైన్స్ టెండర్ల నోటిఫికేషన్ రద్దు చేయాలంటూ హైకోర్టులో పిటిషన్

ABN , First Publish Date - 2023-08-18T15:58:38+05:30 IST

తెలంగాణ వైన్స్ టెండర్ల నోటిఫికేషన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రద్దు చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.

T.Highcourt: భద్రాద్రిలో వైన్స్ టెండర్ల నోటిఫికేషన్ రద్దు చేయాలంటూ హైకోర్టులో పిటిషన్

హైదరాబాద్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తెలంగాణ వైన్స్ టెండర్ల నోటిఫికేషన్ రద్దు చేయాలంటూ హైకోర్టులో (Telangana High Court)
పిటిషన్ దాఖలైంది. లంబాడీ హక్కుల పోరాట సమితి నాయకులు భూక్యా దేవా నాయక్ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. పీసా చట్టానికి అనుగుణంగా వైన్స్ టెండర్స్ నోటిఫికేషన్ జారీ చేయలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. శుక్రవారం ఈ పిటిషన్‌పై హైకోర్టులో విచారణకు రాగా.. షెడ్యూల్ ఏరియాలో పీసా చట్టానికి అనుగుణంగా తీర్మానాలు తెలంగాణ ఎక్సైజ్ శాఖ తీసుకోకుండా టెండర్ల ప్రక్రియ జారీ చేసిందని పిటిషనర్ తరపు న్యాయవాది మంగీలాల్ నాయక్ వాదించారు. వెంటనే టెండర్లు నిలిపి వెయ్యాలని కోరారు. అయితే రేపటి (శనివారం) వరకు సమయం కావాలని కోర్టును ప్రభుత్వం కోరింది. దీంతో తదుపరి విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది.

Updated Date - 2023-08-18T16:00:02+05:30 IST