Talasani Srinivas: బీఆర్ఎప్ ప్రభుత్వం వచ్చాకే పేద వర్గాలు బాగుపడ్డాయి
ABN , First Publish Date - 2023-08-05T13:15:24+05:30 IST
రాష్ట్రంలో చేపల ఉత్పత్తి రెండింతలు పెరిగిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav) అన్నారు. శాసనమండలిలో మంత్రి మాట్లాడారు. ‘‘18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క మత్స్యకారుడికి మెంబర్ షిప్ ఇస్తున్నాం.
హైదరాబాద్: రాష్ట్రంలో చేపల ఉత్పత్తి రెండింతలు పెరిగిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav) అన్నారు. శాసనమండలిలో మంత్రి మాట్లాడారు. ‘‘18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క మత్స్యకారుడికి మెంబర్ షిప్ ఇస్తున్నాం. కుల వృత్తులను ప్రోత్సహిస్తే కొన్ని రాజకీయ పార్టీలు హేళనగా మాట్లాడుతున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే పేద, బడుగు, బలహీన వర్గాలు అభివృద్ధి చెందుతున్నాయి. మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది.’’ అని తలసాని తెలిపారు.
టీచర్స్ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి కామెంట్స్..
యూనివర్సిటీలో పని చేస్తోన్న కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని టీచర్స్ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి డిమాండ్ చేశారు. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వ్యవహార శైలి సరిగ్గా లేదన్నారు.