TS News: యువ సంఘర్షణ సభలో రేవంత్ ఇచ్చిన హామీలు ఇవే
ABN , First Publish Date - 2023-05-08T18:21:57+05:30 IST
తెలంగాణ (Telangana) సాధన ఆకాంక్షలు నెరవేరక నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
హైదరాబాద్: తెలంగాణ (Telangana) సాధన ఆకాంక్షలు నెరవేరక నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ఆవేదన వ్యక్తం చేశారు. మనకు అండగా ఉండాలనే ప్రియాంక గాంధీ వచ్చారని తెలిపారు. సరూర్నగర్లో కాంగ్రెస్ (Congress) యువ సంఘర్షణ సభ ఆయన మాట్లాడారు. తెలంగాణలోని వర్సిటీలు ఆత్మగౌరవ ప్రతీకలన్నారు. 'మన రాష్ట్రం- మన కొలువులు' నినాదంతో యువతీయువకులు లాఠీ దెబ్బలు తిన్నారు, ప్రాణాలు అర్పించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ పాలనలో యువతకు న్యాయం జరగదన్నారు.
తెలంగాణ పోరాడినవారిని స్వాతంత్ర సమరయోధులుగా గుర్తిస్తామని తెలిపారు. అలాగే వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, రూ.25 వేల గౌరవ పెన్షన్ ఇస్తామని రేవంత్‌రెడ్డి తెలిపారు. అలాగే తెలంగాణ సమరయోధులపై ఉన్న అక్రమ కేసులు ఎత్తివేస్తామన్నారు. కాంగ్రెస్ వచ్చిన ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్నారు. జూన్ 2న నోటిఫికేషన్, సెప్టెంబర్‌లో నియామక పత్రాలు అందించనున్నట్లు చెప్పారు. నిరుద్యోగులకు రూ.4 వేల భృతి ఇస్తామని వెల్లడించారు. TSPSC రాజకీయ నిరుద్యోగుల పునరావాస కేంద్రంగా మారిందని మండిపడ్డారు. ఉద్యోగాల భర్తీకి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి జిల్లాలో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు.