హైకోర్టులో ధర్మపురి అసెంబ్లీ సెగ్మెంట్ EVM స్ట్రాంగ్ రూమ్ తాళాల గల్లంతు వివాదం
ABN , First Publish Date - 2023-04-12T15:37:42+05:30 IST
తెలంగాణ హైకోర్టు (Telangana Highcourt)లో ధర్మపురి అసెంబ్లీ సెగ్మెంట్ EVM స్ట్రాంగ్ రూమ్ తాళాల గల్లంతు వివాదం రేగింది.
హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు (Telangana Highcourt)లో ధర్మపురి అసెంబ్లీ సెగ్మెంట్ EVM స్ట్రాంగ్ రూమ్ తాళాల గల్లంతు వివాదం రేగింది. సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాను హైకోర్టు ఆదేశించింది. తదుపరి చర్యలు ఏం తీసుకుంటారో తెలపాలని జిల్లా కలెక్టర్ కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ ఈనెల 18కి కోర్టు వాయిదా వేసింది. 2018లో కాంగ్రెస్ (Congress) అభ్యర్థి లక్ష్మణ్ కుమార్ పై 441 ఓట్ల తేడాతో మంత్రి కొప్పుల ఈశ్వర్ (Koppula Eshwar) గెలుపొందారు. అయితే ఆయన గెలుపుపై కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మణ్ కుమార్ (Lakshman Kumar) హైకోర్టును ఆశ్రయించారు.