Talasani Srinivas Yadav: అక్కడ కళాకారులు, డీజేలను ఏర్పాట్లు చేస్తున్నాం: తలసాని
ABN , First Publish Date - 2023-06-17T14:14:52+05:30 IST
దశాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా 22న అమర జ్యోతి ప్రారంభోత్సవం పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav) ఆదేశించారు.
హైదరాబాద్: దశాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా 22న అమర జ్యోతి ప్రారంభోత్సవం పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav) ఆదేశించారు. సాయత్రం నాలుగు గంటలకి అంబేద్కర్ విగ్రహం నుంచి భారీ వాహన ర్యాలీలు నిర్వహించాలని సూచించారు. అలాగే అన్ని నియోజక వర్గ కేంద్రాల నుంచి దాదాపు రెండు వేల మందితో ర్యాలీలు చేపట్టాలన్నారు. ఎన్నికలు దగ్గరలో ఉన్నాయి కాబట్టి ఈ ర్యాలీలతో సగం ప్రచారం జరిగినట్లు అవుతుందన్నారు. సాయంత్రం ఐదు గంటల లోపు నియోజక వర్గ కేంద్రాల నుంచి ఎమ్మెల్యేలు ర్యాలీగా బయలుదేరి అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకోవాలని సూచించారు. నియోజక వర్గాల్లో లేనిపోని గ్రూపులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మన ప్రభుత్వంలో అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామన్నారు. ఖైరతాబాద్, అంబర్పెట్, ముషీరాబాద్, గోషమహల్, కూకట్ పల్లి, మల్కాజ్ గిరి నుంచి పెద్ద ఎత్తున మూడు వేల మందితో ర్యాలీలో పాల్గొనాలన్నారు. అంబేద్కర్ విగ్రహం వద్ద అన్ని ఏర్పాట్లు ఉంటాయని తలసాని తెలపారు. అంబేద్కర్ విగ్రహం వద్ద కళాకారులు, డీజేల ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. ఆ రోజు కార్పొరేషన్ ఛైర్మన్‌లు షోకు టాప్ చెయ్యొద్దన్నారు.