TS News: తెలంగాణ హైకోర్టును కేంద్ర ప్రభుత్వం కోరిన విషయం ఇదే

ABN , First Publish Date - 2023-04-12T18:16:58+05:30 IST

IAS, IPS బదిలీల విచారణను అత్యవసరంగా చేపట్టాలని తెలంగాణ హైకోర్టు (Telangana Highcourt) ను కేంద్ర ప్రభుత్వం కోరింది.

TS News: తెలంగాణ హైకోర్టును కేంద్ర ప్రభుత్వం కోరిన విషయం ఇదే

ఢిల్లీ: IAS, IPS బదిలీల విచారణను అత్యవసరంగా చేపట్టాలని తెలంగాణ హైకోర్టు (Telangana Highcourt) ను కేంద్ర ప్రభుత్వం కోరింది. జూన్‌ 5న విచారణ చేపడతామని తెలంగాణ హైకోర్టు తెలిపింది. రాష్ట్ర విభజన తర్వాత 14 మంది IAS, IPS అధికారులను ఏపీ (AP), తెలంగాణ (Telangana)కు కేంద్రం కేటాయించింది. కేంద్ర ఉత్వర్వులపై అధికారులు క్యాట్‌ను ఆశ్రయించారు. క్యాట్ ఉత్తర్వులపై తెలంగాణ హైకోర్టులో కేంద్ర ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. తెలంగాణలో పని చేస్తున్న డీజీపీ అంజనీకుమార్ సహా 12 మంది అధికారుల బదిలీలపై ఉత్కంఠ కొనసాగుతుంది. ఇప్పటికే హైకోర్టు అదేశంతో IAS అధికారి సోమేశ్‌కుమార్ ఏపీకి వెళ్లారు.

Updated Date - 2023-04-12T18:17:02+05:30 IST