Hyderabad: జూబ్లీహిల్స్ మోతీనగర్‌లో ఉద్రిక్తత
ABN , First Publish Date - 2023-05-14T09:29:51+05:30 IST
హైదరాబాద్: నగరంలోని జూబ్లీహిల్స్ మోతీనగర్‌లో ఉద్రిక్తత (Tension) నెలకొంది. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా టీడీపీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేశారు.
హైదరాబాద్: నగరంలోని జూబ్లీహిల్స్ మోతీనగర్‌లో ఉద్రిక్తత (Tension) నెలకొంది. ఎన్టీఆర్ శతజయంతి (NTR Centenary) ఉత్సవాల్లో భాగంగా టీడీపీ (TDP) ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహం (NTR Statue) ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడ ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుకు అనుమతి లేదంటూ జీహెచ్ఎంసీ (GHMC) అధికారులు అడ్డుకున్నారు. ఎన్టీఆర్ విగ్రహం తొలగించేందుకు సంఘటన ప్రదేశానికి జీహెచ్ఎంసీ అధికారులు, పోలీసులు చేరుకున్నారు. అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీసులు మోహరించారు. కాగా ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కుట్రపూరితంగా ఎన్టీఆర్ విగ్రహం తొలగిస్తున్నారంటూ టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలోనూ రెండుసార్లు ఎన్టీఆర్ విగ్రహాన్ని తొలగించారంటూ ఎమ్మెల్యే మాగంటిపై టీడీపీ నేతలు మండిపడ్డారు.