T.Highcourt: మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు హైకోర్టులో చుక్కుదురు
ABN , First Publish Date - 2023-07-25T13:21:48+05:30 IST
మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు తెలంగాణ హైకోర్టులో చుక్కుదురైంది.
హైదరాబాద్: మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు (Minister Srinivas Goud) తెలంగాణ హైకోర్టులో (Telangana High court) చుక్కుదురైంది. తన ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్‌ను కొట్టివేయాలంటూ శ్రీనివాస్‌గౌడ్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే మంత్రి వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు ధ్రువ పత్రాలు సమర్పించారంటూ మహబూబ్‌నగర్ ఓటర్ రాఘవేంద్ర రాజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్యేగా, మంత్రిగా కొనసాగే అర్హత లేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆ పిటిషన్‌కు అర్హత లేదని పిటిషన్‌ను కొట్టివేయాలని శ్రీనివాస్ గౌడ్ మరో పిటిషన్ వేశారు. దీనిపై ఇప్పటికే హైకోర్టులో ఇరువాదనలు పూర్తి అవగా.. శ్రీనివాస్ గౌడ్ వేసిన పిటిషన్ కొట్టివేస్తూ న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది. పిటిషనర్ వేసిన పిటిషన్‌ను హైకోర్టు ధర్మాసనం అనుమతించింది.