TS Assembly: ప్రారంభమైన శాసనసభ, మండలి.. చర్చించే అంశాలు ఇవే..!

ABN , First Publish Date - 2023-08-05T10:31:28+05:30 IST

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మూడో రోజు ప్రారంభమయ్యాయి. అనంతరం స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రశ్నోత్తరాలు చేపట్టారు. అలాగే శాసనమండలిలో కూడా ప్రశ్నోత్తరాలు చేపట్టారు.

TS Assembly: ప్రారంభమైన శాసనసభ, మండలి.. చర్చించే అంశాలు ఇవే..!

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మూడో రోజు ప్రారంభమయ్యాయి. అనంతరం స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రశ్నోత్తరాలు చేపట్టారు. అలాగే శాసనమండలిలో కూడా ప్రశ్నోత్తరాలు చేపట్టారు.

శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో..

1. జీహెచ్ఎంసీలో ఫ్లై ఓవర్లు, లింకు రోడ్ల నిర్మాణం

2. ఎస్సీలకు ప్రీ మరియు పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్‌లు

3. జీహెచ్ఎంసీ పరిధిలో ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ మరియు రిజిస్ట్రేషన్

4. చేపల పెంపకం మరియు ఉత్పత్తి

5. పారిశ్రామిక సముదాయాల ఏర్పాటు

6. అత్యంత వెనుకబడిన తరగతుల (ఎంబీసీలు) వారికి ఆర్థిక సహాయం

7. హైదరాబాద్‌లోని పాతబస్తీలో రహదారుల నిర్మాణం

8. బీసీ కుల వృత్తిదారులకు ఆర్థిక సహాయం

9. దళిత బంధు పథకం

10. గొర్రె యూనిట్ల పంపిణీ

ప్రశ్నలు చర్చకు రానున్నాయి..

  • మండలంలో మూడు అంశాలపై పేపర్స్ టేబుల్ చేయనున్నారు.

1. మినిస్టర్ గంగుల కమలాకర్, తెలంగాణ స్టేట్ ఫుడ్ కమిషన్ వార్షిక నివేదిక 2021-22

2. మినిస్టర్ జగదీశ్ రెడ్డి, తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ వార్షిక నివేదిక 2021- 22

3. మినిస్టర్ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆఫ్ ది ఇయర్ 2019- 20 వార్షిక నివేదికను మండలి‌లో టేబుల్ చేయనున్నారు.

శాసన మండలిలో స్వల్పకాలిక చర్చలో..

  • తెలంగాణలో గిరిజనుల అభివృద్ధి, పొడుపట్టాల పంపిణీపై చర్చిస్తారు.

  • గవర్నర్ తిప్పి పంపిన నాలుగు బిల్లులను ప్రవేశపెట్టి ఆమోదించనున్నారు.

శాసనసభలో ప్రశ్నోత్తరాలు..

1) హరితవనాల పెంపు

2) రాష్ట్రంలో పామాయిల్ తోటల పెంపకం

3) నూతన వైద్య కళాశాల ఏర్పాటు

4) సింగరేణి బొగ్గు గనుల వేలం

5) తలసరి ఆదాయం పెరుగుదల

6) మిషన్ భగీరథ పథకం కొరకు రుణాలు

7) గ్రామ పంచాయతీలుగా తండాలు మరియు గిరిజన ఆదివాసి గూడెములు.

8) నూతన వ్యవసాయ కళాశాలల ఏర్పాటు

9) దెబ్బతిన్న రహదారులు మరియు కల్వర్టులకు మరమ్మతులు.

10) అనంత పద్మనాభ స్వామి దేవాలయ పునర్నిర్మాణం

ఈ ప్రశ్నలు చర్చకు రానున్నాయి...

  • శుక్రవారం శాసనసభలో ప్రవేశపెట్టిన మరో మూడు బిల్లులను ఈరోజు చర్చించి ఆమోదించనున్నారు.

1) ది తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ బిల్ 2023ను ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు.. శాసనసభలో చర్చకు ప్రవేశపెట్టి సభ ఆమోదం కోరనున్నారు.

2) ది ఫ్యాక్టరీస్ అమెండ్మెంట్ బిల్లు 2023ను కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి.. శాసనసభలో చర్చకు ప్రవేశపెట్టి సభ ఆమోదం కోరనున్నారు.

3) తెలంగాణ మైనార్టీ కమిషన్ సవరణ బిల్లు 2023ను మైనార్టీ వెల్ఫేర్ మినిస్టర్ కొప్పుల ఈశ్వర్.. శాసనసభలో చర్చకు ప్రవేశపెట్టి సభ ఆమోదం కోరనున్నారు.

Updated Date - 2023-08-05T10:31:28+05:30 IST