BJP: హైదరాబాద్‌లో మకాం వేసిన బీజేపీ అగ్రనేతలు
ABN , First Publish Date - 2023-11-26T07:34:00+05:30 IST
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ పోలింగ్‌కు ఇంకా నాలుగు రోజులు మాత్రమే గడువు ఉండడంతో బీజేపీ అగ్రనేతలు నరేంద్రనాధ్ మోదీ, అమిత్ షా, ఆదిత్యనాధ్ యోగీ తదితరులు హైదరాబాద్‌లో మకాం వేశారు. రెండోరోజు ఆదివారం ఉదయం మోదీ రాజ్ భవన్ నుంచి బయలుదేరి బేగంపేట్ ఎయిర్‌పోర్టు నుంచి తుఫ్రాన్‌కు వెళతారు.
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ పోలింగ్‌కు ఇంకా నాలుగు రోజులు మాత్రమే గడువు ఉండడంతో బీజేపీ అగ్రనేతలు నరేంద్రనాధ్ మోదీ, అమిత్ షా, ఆదిత్యనాధ్ యోగీ తదితరులు హైదరాబాద్‌లో మకాం వేశారు. రెండోరోజు ఆదివారం ఉదయం మోదీ రాజ్ భవన్ నుంచి బయలుదేరి బేగంపేట్ ఎయిర్‌పోర్టు నుంచి తుఫ్రాన్‌కు వెళతారు. మధ్యాహ్నం 12 గంటలకు మెదక్ జిల్లా, తుఫ్రాన్ ఎన్నికల సభలో ఆయన ప్రసంగించనున్నారు. తర్వాత 1.30 గంటలకు ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ సభలో ప్రధానమంత్రి పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం తిరుపతికి బయలుదేరి వెళతారు. ఈ రాత్రి తిరుమలలో బస చేస్తారు. సోమవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకోనున్నారు.
కాగా ఇవాళ బీజేపీ, జనసేన ఆధ్వర్యంలో ఉమ్మడి బహిరంగ సభ జరగనుంది. సాయంత్రం 6 గంటలకు కూకట్పల్లి నియోజకవర్గం బాలానగర్‌లో జరగనున్న సభకు అమిత్ షా, పవన్ కళ్యాణ్, మందకృష్టమాదిగ హాజరవుతున్నారు.
అమిత్ షా షెడ్యూల్
బీజేపీ అభ్యర్థుల తరుపున అమిత్ షా తెలంగాణలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆయన బహిరంగ సభలు, రోడ్ షోలతో బీజేపీ క్యాడర్లో ఉత్సాహం నెలకొంది. ఆదివారం ఉదయం 11.15 గంటలకు అమిత్ షా మక్తల్ నియోజకవర్గంలో జరగనున్న సభలో పాల్గొని ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 1 గంటకు మునుగోడులో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. సాయంత్రం 3.45 గంటలకు భువనగిరిలో బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం ఆరు గంటలకు హైదరాబాద్, బాలానగర్‌లో పవన్ కళ్యాణ్‌తో కలసి ఎన్నికల సభ నిర్వహిస్తారు.
యోగీ షెడ్యూల్
రెండో రోజు తెలంగాణలో ఉత్తరప్రదేశ్ సీఎం యోగీ ప్రచారం నిర్వహిస్తారు. ఉదయం 11.30 గంటలకు మహబూబ్‌నగర్‌లో ఎన్నికల సభలో పాల్గొంటారు. 1.15 గంటలకు కల్వకుర్తిలో ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తారు. సాయంత్రం 3.15 గంటలకు ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. అనంతరం 4.40 గంటలకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం చింతల్లో యోగీ రోడ్ షో నిర్వహిస్తారు.