TS News: జీహెచ్ఎంసీ యాక్షన్ ప్లాన్ సిద్ధం
ABN , First Publish Date - 2023-04-01T14:39:03+05:30 IST
జిల్లాలోని రాజేంద్రనగర్ పరిధిలో జీహెచ్ఎంసీ (GHMC) యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తోంది.
రంగారెడ్డి: జిల్లాలోని రాజేంద్రనగర్ పరిధిలో జీహెచ్ఎంసీ (GHMC) యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తోంది. అక్రమ నిర్మాణాలపై టౌన్ ప్లానింగ్ అధికారుల చర్యలు తీసుకుంటున్నారు. మైలార్దేవుపల్లి డివిజన్ క్రిస్టల్ టవర్స్కాలనీలో కూల్చివేతలు ప్రారంభించారు. బండ్లగూడ దగ్గర అక్రమ నిర్మాణాలు, ఇళ్లను అధికారులు కూల్చివేస్తున్నారు. అనుమతులు లేకుండా బహుళ అంతస్తుల భవనాల నిర్మాణం చేపట్టడంతో అధికారులు ఈ చర్యలకు పాల్పడుతున్నారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య అక్రమ నిర్మాణాలు కూల్చివేతలు ప్రారంభించారు. ఇంటి యజమానులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.