TSPSC Leakage: సిట్ కార్యాలయానికి టీఎస్‌పీఎస్సీ సెక్రటరీ

ABN , First Publish Date - 2023-04-01T11:08:41+05:30 IST

టీఎస్‌పీఎస్సీ లీకేజ్‌ కేసులో సిట్ విచారణ కొనసాగుతోంది.

TSPSC Leakage: సిట్ కార్యాలయానికి టీఎస్‌పీఎస్సీ సెక్రటరీ

హైదరాబాద్: టీఎస్‌పీఎస్సీ లీకేజ్‌ కేసు (TSPSC Leakage Case)లో సిట్ విచారణ కొనసాగుతోంది. టీఎస్‌పీఎస్సీ సెక్రటరీ అనిత రామచంద్రన్ (TSPSC Secretary Anitha Ramachandran) ఈరోజు ఉదయం సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ కేసుకు సంబంధించి టీఎస్‌పీఎస్సీ సభ్యులకు కూడా సిట్ నోటీసులు ఇచ్చింది. ఈరోజు సభ్యులందరూ విచారణకు హాజరుకావాలని నోటీసులో పేర్కొంది. ఈ క్రమంలో టీఎస్‌పీఎస్సీ సెక్రటరీ అనిత రామచంద్రన్ సిట్ విచారణకు హాజరయ్యారు. టీఎస్‌పీఎస్సీ ఆఫీస్‌లో సెక్రటరీ ఆధీనంలోనే కాన్ఫిడెన్షియల్ విభాగం మొత్తం నడుస్తోంది. ప్రశ్నాపత్రాల తయారీ, వాటిని భద్రపరచడం ఇలా అన్ని కార్యక్రమాలు సెక్రటరీ ఆధీనంలోనే జరుగుతుంది. ఈ క్రమంలో పరీక్ష నిర్వహణపై అనితను సిట్‌ అధికారులు విచారించనున్నారు. గ్రూప్ 1 రాసిన ప్రవీణ్‌ను విధుల నుంచి ఎందుకు తప్పించలేదన్న దానిపై అనితను ప్రశ్నించనుంది.

ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న ప్రవీణ్... అనితా రామచంద్రన్ వద్ద పీఏగా పనిచేశాడు. ప్రవీణ్ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్షను రాశారు. గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ప్రశ్నాపత్రాన్ని లీక్ చేసి అందులో 103 మార్కులు సాధించాడు. ఈ క్రమంలో ప్రవీణ్‌కు సంబంధించిన వివరాలను అనితా రామచంద్రన్ వద్ద సిట్‌ అధికారులు ప్రశ్నిస్తున్నారు. టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల తయారీ, భద్రత, ఉద్యోగ నియామకాల పరీక్షలకు సంబంధించిన వివరాలను అనిత రామచంద్రన్ వద్ద అడిగి తెలుసుకుంటున్నారు. అనితా రామచంద్రన్ వాంగ్మూలాన్ని సిట్ అధికారులు నమోదు చేస్తున్నారు. అలాగే టీఎస్‌పీఎస్సీ కమిటీలో సభ్యుడిగా కొనసాగుతున్న లింగారెడ్డికి కూడా సిట్‌ నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం కస్టడీలో ఉన్న రమేష్‌.. డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా, టీఎ్‌సపీఎఎస్సీ కమిటీ సభ్యుడు లింగారెడ్డికి పీఏగా పనిచేశాడు. ఈ నేపథ్యంలో రమేష్‌కు లింగారెడ్డికి ఉన్న సాన్నిహిత్యంపై సిట్ అధికారులు విచారించనున్నారు. లింగారెడ్డి రెడ్డి, అనిత చెప్పే వివరాలు బట్టి మరి కొంతమందికి సిట్ అధికారులు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది.

Updated Date - 2023-04-01T11:37:31+05:30 IST