Share News

Rajnath Singh: హైదరాబాద్‌కు కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్

ABN , Publish Date - Dec 17 , 2023 | 07:26 AM

హైదరాబాద్: దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో ఆదివారం ఉదయం కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅథితిగా భారత దేశ రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ హజరుకానున్నారు.

Rajnath Singh: హైదరాబాద్‌కు కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్

హైదరాబాద్: దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో ఆదివారం ఉదయం కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅథితిగా భారత దేశ రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ హజరుకానున్నారు. దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో జరగనున్న పరేడ్‌లో యువపైలెట్ల ప్రదర్శన జరుగుతుంది. ఈ కార్యక్రమంలో శిక్షణ పొందిన 212 మంది యువ పైలైట్లు పాల్గొననున్నారు. వారితోపాటు పరేడ్‌కు ఇతర దేశాలకు చెందిన సైనికాదికారులు కూడా హాజరవుతున్నారు. పరేడ్ అనంతరం అధికారికంగా యువ పైలెట్లు ఎయిర్ ఫోర్స్‌లో అడుగుపెడతారు. పిలాటస్ పీసీ-7 ట్రైనింగ్ ఎయిర్ క్రాఫ్ట్, సుఖోయ్-30, సారంగ్ హెలిక్యాప్టర్లతో విన్యాసాలు చేయనున్నారు.

Updated Date - Dec 17 , 2023 | 07:26 AM